Begin typing your search above and press return to search.

భోలా జీ రాకతో నాగ్‌ కి క్లారిటీ వచ్చినట్లేనా?

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది

By:  Tupaki Desk   |   15 Aug 2023 6:01 AM GMT
భోలా జీ రాకతో నాగ్‌ కి క్లారిటీ వచ్చినట్లేనా?
X

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్‌ హిట్ మూవీ వేదాళంకు భోళా శంకర్ రీమేక్ అనే విషయం తెల్సిందే. రీమేక్ విషయంలో మొదట చిరంజీవి ఆసక్తి చూపించలేదు. కానీ దర్శకుడు మెహర్‌ రమేష్ కోసం చిరంజీవి ఈ సినిమాను చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

భోళా శంకర్ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా అసంతృప్తితో ఉన్నారని టాక్‌. నిర్మాత అనిల్ సుంకర కి భారీ నష్టం తప్పేలా లేదు అంటూ బాక్సాఫీస్ రిపోర్ట్‌ అందుతోంది. ఈ నేపథ్యంలో భోళా శంకర్‌ సినిమా చాలా మంది హీరోలకు ఒక పాఠం అన్నట్లుగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి రీమేక్ ఫలితం నేపథ్యంలో నాగార్జున తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు నాగార్జున మలయాళ చిత్రం పొరింజు మరియం జోస్‌ రీమేక్‌ చేయాలని భావించాడు. ఆ విషయంలో నిర్ణయం తీసుకోలేక ఊగిసలాటలో ఉన్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా భోళా శంకర్ సినిమా ఫలితం నేపథ్యం లో నాగార్జున ఆ రీమేక్ ని వదిలేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో రీమేక్ లు ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే నాగార్జున కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.

నాగార్జున గత చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతూ వస్తున్నాయి. దాంతో నాగార్జున తదుపరి సినిమా విషయంలో రిస్క్‌ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో మొదట రీమేక్ చేయాలని భావించాడు. కానీ ఇప్పడు రీమేక్ పెద్ద రిస్క్ అని భావిస్తున్నారు. అందుకే నాగార్జున రీమేక్‌ కాకుండా ఒరిజినల్ కథతో సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.