Begin typing your search above and press return to search.

నాగార్జున ఈ వెయిటింగ్ ఎందుకో..?

ఒక హిట్టు పడ్డాక కూడా సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎందుకో ఇంకా కథల వేట కొనసాగిస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:50 AM GMT
నాగార్జున ఈ వెయిటింగ్ ఎందుకో..?
X

ఒక హిట్టు పడ్డాక కూడా సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎందుకో ఇంకా కథల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో నా సామిరంగ హిట్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేసినట్టు భావిస్తున్న నాగార్జున ఇక మీదట అలాంటి సినిమాలతోనే సంక్రాంతి సీజన్ కు వస్తామని ప్రకటించారు. అయితే అనౌన్స్ మెంట్ అయితే చేశారు కానీ నాగార్జున నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అఫ్కోర్స్ ధనుష్ లీడ్ రోల్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నాగార్జున కూడా భాగం అవుతున్నారు. కానీ అది మల్టీస్టారర్ సినిమానే అవుతుంది తప్ప సోలో సినిమా కాదు.

నాగార్జున సోలో సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆమధ్య ఒకటి రెండు యాక్షన్ సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో సూపర్ హిట్ కొడుతున్నారు నాగార్జున. ప్రస్తుతం తన దగ్గరకు వచ్చిన కథలన్నిటినీ జల్లెడ పట్టి సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ ని కూడా ఇంకాస్త మెరుగుపరిచి అప్పుడు సినిమా చేయాలని భావిస్తున్నారట నాగార్జున. నాగార్జున మైల్ స్టోన్ మూవీ 100వ సినిమా ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

ఆ మధ్య గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో నాగార్జున సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. నాగార్జున, అఖిల్ లతో కలిసి ఒక క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్నారని అన్నారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. నాగార్జున మోహన్ రాజాతో రిస్క్ ఎందుకని ఆ సినిమా కాదనుకున్నారని టాక్. నా సామిరంగ ఇచ్చిన హిట్ కిక్ తో నాగార్జున ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది. ఆడియన్స్ కు ఒక మంచి సినిమా అందిస్తే ఎప్పుడు వారు దాన్ని హిట్ చేస్తారని నా సామిరంగ తో మరోసారి తెలుసుకున్న నాగార్జున ఇక మీదట అలాంటి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.

నాగార్జున దగ్గరకు పదుల కొద్ది స్క్రిప్ట్స్ రాగా వాటిలో ఒక 3 ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేసి త్వరలో అనౌన్స్ చేస్తారని అంటున్నారు. నా సామిరంగ తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ బిన్నీ కి కూడా మరో ఛాన్స్ ఇస్తారని టాక్.