Begin typing your search above and press return to search.

ఇంట్లో చెప్ప‌కుండా అంత దాకా తెచ్చిన నాగ్

నిజానికి మేం సంక్రాంతికి రాగలమని ఎవరూ నమ్మలేదు. కానీ నా టీమ్ ఎప్పుడూ ఆశ కోల్పోలేదు

By:  Tupaki Desk   |   29 Jan 2024 4:11 AM GMT
ఇంట్లో చెప్ప‌కుండా అంత దాకా తెచ్చిన నాగ్
X

అక్కినేని అభిమానులు వారి ఎనలేని ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞుడను. ఫ్లాప్‌లు హిట్‌లతో సంబంధం లేకుండా, వారు తమ ప్రేమ ఆద‌ర‌ణ‌తో నాకు కొండంత శక్తిని ఇస్తారు అని అన్నారు కింగ్ నాగార్జున‌. సంక్రాంతి బ‌రిలో కింగ్ నాగార్జున నటించిన 'నా సామి రంగ' చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన సంగ‌తి తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన గ్రామీణ యాక్షన్ డ్రామాలో అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మర్నా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. హైదరాబాద్‌లో టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

నాగార్జున మాట్లాడుతూ ''అభిమానులే నాకు కొండంత అండ‌. మేము చివరి నిమిషంలో విడుదల గురించి కమ్యూనికేట్ చేసినప్పటికీ, మా పంపిణీదారులు మాకు మద్దతు ఇచ్చారు. నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు నా టీమ్‌ని మిస్ అవుతున్నాను. నా సామి రంగ షూటింగ్‌ని బాగా ఎంజాయ్ చేశాను'' అని అన్నారు. మేము షూటింగ్ ప్రారంభించిన సెప్టెంబర్ 20న ANR విగ్రహాన్ని ఆవిష్కరించారు. షూటింగ్ గురించి నా కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. సంక్రాంతికి 'నా సామి రంగ‌'ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను అని చెప్ప‌గానే వాళ్లు షాక్ అయ్యారు'' అని తెలిపారు.

నిజానికి మేం సంక్రాంతికి రాగలమని ఎవరూ నమ్మలేదు. కానీ నా టీమ్ ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. కీరవాణి గారు ఒక టైం టేబుల్ డిజైన్ చేసారు. సమయానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్ర‌తిదీ విజ‌య‌వంత‌మైంది అని నాగార్జున తెలిపారు. మాకు మద్దతుగా నిలిచిన మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చే సంక్రాంతికి కలుద్దామ‌ని కూడా అన్నారు.