Begin typing your search above and press return to search.

హిట్‌ ఫార్ములాతో నాగ్‌ తదుపరి సినిమా..?

తాజాగా సంక్రాంతికి వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ అనే విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   18 Jan 2024 5:38 AM GMT
హిట్‌ ఫార్ములాతో నాగ్‌ తదుపరి సినిమా..?
X

వైల్డ్‌ డాగ్‌, ది ఘోస్ట్‌ వంటి యాక్షన్ సినిమాల్లో కంటే నాగార్జునను బంగార్రాజు, నా సామి రంగ వంటి మాస్‌ సినిమాల్లో చూసేందుకే ఆయన ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. ప్రస్తుతం విలేజ్ బ్యాక్ డ్రాప్‌ లో రూపొందుతున్న మాస్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం మనం చూస్తున్నాం.

తాజాగా సంక్రాంతికి వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న హనుమాన్ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ అనే విషయం తెల్సిందే. ఇక నా సామి రంగ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్‌ లోనే వచ్చింది. అందుకే విలేజ్ బ్యాక్ డ్రాప్ అనేది హిట్‌ ఫార్ములా అనే అభిప్రాయాన్ని చాలా మంది సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఇక ముందు నాగార్జున విలేజ్ బ్యాక్ డ్రాప్ మాస్ సినిమా కథ లను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమాలో నాగ్ పాత్ర ఏంటి, కథ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీ లేదు.

ముందు ముందు మాత్రం నాగార్జున విలేజ్ బ్యాక్ డ్రాప్ మాస్ సినిమా ను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే బంగార్రాజు కి కొనసాగింపుగా కథను రెడీ చేయించే పనిలో పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు మరో బంగార్రాజు ను రెడీ చేసే విధంగా అప్పుడే చర్చలు మొదలు అయ్యాయట.

నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా లో బంగార్రాజు పాత్రలో నటించి మెప్పించాడు. అందుకే ఆ పాత్రను బేస్ చేసుకుని బంగార్రాజు సినిమాను రూపొందించడం జరిగింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ముందు ముందు మరిన్ని అలాంటి పాత్రలు అలాంటి కథలతో సినిమాలు చేయాలని నాగార్జున భావిస్తున్నాడు అని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.