Begin typing your search above and press return to search.

నాగ్.. ఇది లాభమా నష్టమా?

కింగ్ నాగార్జున ప్రస్తుతం నా సామి రంగా అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది

By:  Tupaki Desk   |   2 Oct 2023 5:14 AM GMT
నాగ్.. ఇది లాభమా నష్టమా?
X

కింగ్ నాగార్జున ప్రస్తుతం నా సామి రంగా అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ సిద్ధమవుతోంది. మలయాళీ హిట్ మూవీ రీమేక్ అనే టాక్ అయితే వినిపిస్తోంది. కానీ అఫీషియల్ గా క్లారిటీ లేదు.

ఒక మూవీ తెరకెక్కుతోంది అంటే అందులో హీరో క్యారెక్టరైజేషన్ పూర్తిగా రివీల్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడతాడు. హీరో కూడా ఎక్కువ బయట కనిపించకుండా ఉండటానికి ట్రై చేస్తాడు. అయితే కొంతమంది హీరోలు మాత్రం తాము ఏ సినిమా చేసిన అందులో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తున్న బయట మాత్రం అదే లుక్ తో తిరిగేస్తూ ఉంటారు. కింగ్ నాగార్జున కూడా అలాగే తన కొత్త సినిమా లుక్ లోనే ప్రస్తుతం బయట కనిపిస్తున్నారు.

బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతివారం నాగార్జున షోలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే ఓ వైపు నా సామి రంగా మూవీ షూటింగ్ చేస్తూనే మరో వైపు బిగ్ బాస్ హోస్ట్ గా కూడా చేస్తున్నారు. గతంలో కింగ్ నాగార్జున సినిమాలలో స్పెషల్ లుక్స్ లో కనిపించింది చాలా తక్కువ. అయితే నా సామి రంగా మూవీలో క్యారెక్టర్ కోసం కాస్త గెడ్డం పెంచారు.

ఫస్ట్ టైం ఇలా గెడ్డం, పొడవైన మీసాలతో నాగార్జున కనిపిస్తున్నారు. ఈ లుక్స్ అక్కినేని ఫ్యాన్స్ కి బాగా నచ్చుతోంది. అయితే ఇలా లుక్ రివీల్ చేయడం వలన నా సామి రంగాపై ఒక ఎగ్జైటింగ్ మిస్ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు. నాగార్జున స్క్రీన్ మీద కనిపిస్తే చూసి ఆశ్వాదించేవారు చాలా మంది ఉంటారు. లుక్ రివీల్ అయిన వచ్చే ఇబ్బంది ఏమీ లేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

మరి బిగ్ బాస్ షోలో తన కొత్త సినిమా కోసం చేస్తోన్న క్యారెక్టర్ లుక్ లోనే నాగార్జున కనిపించడం సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది అప్పుడే చెప్పలేని విషయం.