Begin typing your search above and press return to search.

3 నెలలు టార్గెట్ తో నాగార్జున..!

కింగ్ నాగార్జున నెక్స్ట్ సినిమా నా సామిరంగ టీజర్ సినిమాపై సూప బజ్ ఏర్పరచింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది

By:  Tupaki Desk   |   13 Sep 2023 12:30 PM GMT
3 నెలలు టార్గెట్ తో నాగార్జున..!
X

కింగ్ నాగార్జున నెక్స్ట్ సినిమా నా సామిరంగ టీజర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రైటర్ ప్రసన్న కుమార్ తో నాగార్జున సినిమా ఉంటుందని వార్తలు రాగా ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఏమో కానీ ఈ సినిమాకు కూడా ప్రసన్న కుమార్ కథ అందిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న విజయ్ డైరెక్టర్ గా మారి నాగార్జునతో నా సామిరంగ సినిమా చేస్తున్నారు. ఈ మధ్యనే సినిమా నుంచి టీజర్ రాగా అందులో 2024 సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఆ టీజర్ పార్ట్ తప్ప ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదని టాక్.

జనవరికి ఇంకా మూడున్నర నెలలే గ్యాప్ ఉంది. ఆ టైం లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులోనే మళ్లీ నాగార్జున బిగ్ బాస్ కోసం ఒక రెండు రోజులు టైం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత స్పీడ్ గా సినిమా పూర్తి చేయాల్సిన అవసరం ఏంటన్నది తెలియాల్సి ఉంది. నాగార్జునకు సంక్రాంతి రిలీజ్ బాగా కలిసి వస్తుంది. అయితే సినిమా హడావిడిగా చేసి ఆ సెంటిమెంట్ ని నమ్ముకుని రిలీజ్ చేస్తే అసలుకే మోసం వస్తుంది.

ఈ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కూడా కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. 3 నెలల్లో నాగార్జున సినిమా పూర్తి చేయగలరా సినిమా అనుకున్న టైం కు రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా విషయంలో నాగార్జున పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ కోసం వారంలో రెండు రోజులు మిగతా అంతా కూడా ఈ సినిమాకు కేటాయించాలని ఫిక్స్ అయ్యారట. నా సామిరంగా నాగార్జున నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న మాస్ ఎంటర్టైనర్.

క్లాస్ హీరోలు మాస్ డైలాగులు చెబితే ఓ రేంజ్ లో ఉంటుంది. నా సామిరంగ టీజర్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ కూడా ఇది కదా మాకు కావాల్సింది అనుకున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కు వచ్చిన హైప్ తో సినిమాను హడావిడిగా చుట్టేస్తే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేస్తుందని చెప్పొచ్చు. నాగార్జున ఈ సినిమా కోసం రానున్న 3 నెలలు కేటాయించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది కూడా తెలియాల్సి ఉంది. నాగార్జున బిగ్ బాస్ చేస్తూనే ఈ సినిమాకు పూర్తి అయ్యే దాకా రిలాక్స్ అవకూడదని అనుకుంటున్నారట.