Begin typing your search above and press return to search.

నాగ చైతన్య నెక్స్ట్ బిగ్ టార్గెట్..!

అక్కినేని హీరో నాగ చైతన్య కస్టడీ అంటూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు

By:  Tupaki Desk   |   1 Aug 2023 7:03 AM GMT
నాగ చైతన్య నెక్స్ట్ బిగ్ టార్గెట్..!
X

అక్కినేని హీరో నాగ చైతన్య కస్టడీ అంటూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ బైలింగ్వెల్ మూవీగా రిలీజైంది. అయితే తమిళంలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం సక్సెస్ కాలేదు. ఇక ఈ సినిమా తర్వాత చందు మొండేటితో భారీ సినిమా ప్లాన్ చేశాడు నాగ చైతన్య. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్న చందు మొండేటి నాగ చైతన్యతో కూడా పీరియాడికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా కథ కథనాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. సినిమాలో నాగ చైతన్య పాత్ర కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2లో నిర్మించే పెద్ద బడ్జెట్ సినిమా అవుతుందని అంటున్నారు. నాగ చైతన్య చందు మొండేటి ఈ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో చైతు భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో సినిమాలు అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ గా వర్క్ అవుట్ అవుతున్నాయి.

కంటెంట్ బాగుంది అంటే సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా వసూళ్ల పరంపర కొనసాగిస్తున్నాయి. 20 కోట్లు బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. నాగ చైతన్య కూడా చందు మొండేటి తో చేస్తున్న సినిమాతో 100 కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్నాడట. ఎలాగు కార్తికేయ 2 తో చందు పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్క్ చూపించాడు కాబట్టి ఈ సినిమాతో చైతన్య కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేయాలని చూస్తున్నాడట

గీతా ఆర్ట్స్ ప్లాన్ అంటే లెక్కలు అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. నాగ చైతన్య, చందు మొండేటి సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సినిమా మిగతా కాస్టింగ్ ఎవరన్నది బయటకు రావాల్సి ఉంది. నాగ చైతన్య ఈ సినిమా కోసం భారీ వర్క్ అవుట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం చందు ప్లానింగ్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.