Begin typing your search above and press return to search.

కుబేర విషయంలో అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్..!

కుబేర సినిమాలో ధనుష్ లుక్ ఇలా ఉంటే నాగార్జున ఎలా కనిపిస్తాడు అన్న అటెన్షన్ మొదలైంది. అయితే సినిమాలో నాగార్జున ఒక పెద్ద బిజినెస్ మెన్ గా కోటిశ్వరుడిగా కనిపిస్తాడని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 March 2024 12:30 PM GMT
కుబేర విషయంలో అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్..!
X

కోలీవుడ్ హీరో ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. శేఖర్ కమ్ముల నుంచి అసలేమాత్రం ఎక్స్ పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. చిరిగిన చొక్కా ప్యాంటు.. మాసిన గడ్డం పిచ్చోడు లుక్ తో ధనుష్ మోము పైన చిరునవ్వు మాత్రం అదిరిపోగా.. వెనక బిక్షాటన చేస్తున్న శివుడు పోస్టర్ ఈ సినిమా కథను కొంతమేరకు చెప్పే ప్రయత్నం చేస్తుంది.

కుబేర ఫస్ట్ లుక్ ధనుష్ తమిళ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేయగా తెలుగు ఆడియన్స్ కూడా ఫస్ట్ లుక్ చూసి సూపర్ ఎగ్జైట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కుబేర సినిమాలో ధనుష్ లుక్ ఇలా ఉంటే నాగార్జున ఎలా కనిపిస్తాడు అన్న అటెన్షన్ మొదలైంది. అయితే సినిమాలో నాగార్జున ఒక పెద్ద బిజినెస్ మెన్ గా కోటిశ్వరుడిగా కనిపిస్తాడని అంటున్నారు.

మల్టీస్టారర్ సినిమాల్లో ఒక హీరోకి ఎక్కువ మరో హీరోకి తక్కువ స్కోప్ ఇస్తే ఆ హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. కానీ నాగార్జున తో మల్టీస్టారర్ అంటే మాత్రం ఆయనకు ఎంత తక్కువ పాత్ర ఇచ్చినా సరే ఓకే అనేస్తాడు. ఊపిరి సినిమాలో కేవలం వీల్ చెయిర్ లో ఉండి సినిమా అంతా నడిపించాడు నాగార్జున. అయితే కుబేర సినిమాలో కూడా ధనుష్ ముందు అసలు నాగార్జున కనిపిస్తాడా అన్న టెన్షన్ అక్కినేని ఫ్యాన్స్ లో మొదలైంది.

నిడివి ఎంత ఉన్నా సినిమాలో తన పాత్రకు 100 శాతం న్యాయం చేస్తాడు మన కింగ్. అయితే అది డైరెక్టర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానాన్ని బట్టి ఉంటుంది. కుబేరలో నాగార్జున పాత్ర ఏంటి అది ఎలా ఉండబోతుంది. ధనుష్ నట విశ్వరూపం ముందు నాగార్జున కనిపిస్తాడా అన్న ఆలోచన మొదలైంది. ఐతే శేఖర్ కమ్ముల నాగార్జున పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నారని. అందుకే కింగ్ దాన్ని యాక్సెప్ట్ చేశారని అంటున్నారు. కుబేర సినిమా కచ్చితంగా పాన్ ఇండియా ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని తెలుస్తుంది. శేఖర్ కమ్ముల తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.