Begin typing your search above and press return to search.

ఎందుకు ఇలా... అక్కినేని ఫ్యాన్స్ ఆవేదన

ఏజెంట్‌ సినిమా విడుదల అయిన కొన్ని వారాలకే సోనీ లివ్‌ స్ట్రీమింగ్‌ కు సంబంధించిన ప్రకటన వచ్చింది. కానీ సోనీ లివ్‌ ఇప్పటి వరకు ఏజెంట్‌ ను స్ట్రీమింగ్‌ చేయలేదు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 11:30 PM GMT
ఎందుకు ఇలా... అక్కినేని ఫ్యాన్స్ ఆవేదన
X

అక్కినేని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ విషయం లో ఎక్కడో తేడా జరుగుతుందని వారికి మళ్లీ మళ్లీ అనిపిస్తూనే ఉంది. మొదటి సినిమా మొదలుకుని మొన్నటి ఏజెంట్‌ వరకు అన్ని సినిమాల విషయంలో కూడా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఏజెంట్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ విషయం లో ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.

వేసవిలో విడుదల అయిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర భారీ బడ్జెట్‌ తో నిర్మించిన ఏజెంట్‌ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఫ్యాన్స్ కనుక థియేటర్‌ లో చూసినా కూడా ఓటీటీ లో మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. కొందరు ఫ్యాన్స్ థియేటర్ లో మిస్ అయి ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఏజెంట్‌ సినిమా విడుదల అయిన కొన్ని వారాలకే సోనీ లివ్‌ స్ట్రీమింగ్‌ కు సంబంధించిన ప్రకటన వచ్చింది. కానీ సోనీ లివ్‌ ఇప్పటి వరకు ఏజెంట్‌ ను స్ట్రీమింగ్‌ చేయలేదు. ఆ మధ్య రీ ఎడిటింగ్‌ జరుగుతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయం లో నిర్మాతల నుంచి డైరెక్షన్ టీం నుండి క్లారిటీ రాలేదు.

సోనీ లివ్‌ రీ ఎడిట్‌ చేసి సినిమా విడుదల చేసే ప్రయత్నాలు చేస్తుంది అనేది పుకార్లే అని తేలిపోయింది. ఇప్పటికి కూడా సోనీ లివ్‌ వారు ఏజెంట్‌ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు ఎప్పుడు చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఏజెంట్‌ సినిమా రేటు విషయం లో నిర్మాత ఓటీటీ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే సోనీ లివ్‌ అడ్వాన్స్ ఇచ్చి పూర్తి మొత్తం చెల్లించకుండా సినిమా స్ట్రీమింగ్‌ చేయకుండా ఉన్నట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.