Begin typing your search above and press return to search.

అఖిల్ నెక్స్ట్.. ఇది అసలు ప్లాన్

అతని నెక్స్ట్ సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించడానికి సిద్ధమవుతున్నాడు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 4:46 AM GMT
అఖిల్ నెక్స్ట్.. ఇది అసలు ప్లాన్
X

అక్కినేని అఖిల్ ఈ ఏడాది ఏజెంట్ సినిమాతోనే కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కోసం అతను పడ్డ కష్టం అంతా వృథా అయ్యింది. అలాగే నిర్మాత అనిల్ సుంకర కూడా ఏజెంట్ చిత్రంతో బాగా నష్టపోయారు. సురేందర్ రెడ్డి ఏజెంట్ ఆలోచనల నుంచి బయటకొచ్చి పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం వర్క్ చేస్తోన్నారు.ఇదిలా ఉంటే అఖిల్ కొంత గ్యాప్ తీసుకొని ఏజెంట్ థాట్స్ నుంచి పూర్తిగా బయటకొచ్చాడు.

అతని నెక్స్ట్ సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించడానికి సిద్ధమవుతున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ మొత్తం నడవనుందని తెలుస్తోంది. యూవీలో సాహోకి అసిస్టెంట్ గా వర్క్ చేసిన అనిల్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సినిమా బడ్జెట్ 100 కోట్ల వరకు అవుతుందంట.

అయిన కూడా కథ వారికి భాగా నచ్చడంతో పెట్టడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కంటే ముందుగా అఖిల్ లో బడ్జెట్ మూవీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో ఒక సినిమా చేయడానికి చర్చలు జరిగాయనే ప్రచారం నడిచింది.

అందులో ఎలాంటి వాస్తవం లేదని తరువాత క్లారిటీ వచ్చింది. అలాగే శ్రీకాంత్ అడ్డాల పేరు కూడా వినిపిస్తోంది. అయితే అఖిల్ నుంచి మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. యూవీ క్రియేషన్స్ లో అనిల్ కుమార్ తో చేయబోయే పీరియాడికల్ మూవీనే ముందుగా అఖిల్ చేసే `అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ షూటింగ్ 2024 జనవరిలో స్టార్ట్ కానుంది. ఇక సినిమాను 2025 లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది.

అయితే నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అఖిల్ కెరియర్ ఆరంభం నుంచి చూసుకుంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా అఖిల్ ఖాతాలో పడలేదు. మరి నెక్స్ట్ మూవీ అయిన అతనికి లక్ ఇస్తుందేమో వేచి చూడాలి.