Begin typing your search above and press return to search.

అఖిల్.. మళ్ళీ అదే హైప్?

'ఏజెంట్' ప్లాప్ తో బాగా అప్సెట్ అయిన అఖిల్ గత కొద్ది నెలలుగా ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు

By:  Tupaki Desk   |   20 Nov 2023 10:10 AM GMT
అఖిల్.. మళ్ళీ అదే హైప్?
X

అక్కినేని అఖిల్ ఇటీవల 'ఏజెంట్' మూవీ తో ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. 'ఏజెంట్' ప్లాప్ తో బాగా అప్సెట్ అయిన అఖిల్ గత కొద్ది నెలలుగా ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 'ఏజెంట్' కోసం ఎంతో కష్టపడ్డాడు. కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదు. దాంతో ఇప్పటివరకు తన తదుపరి సినిమాని ప్రకటించలేదు.

ఈ సినిమాతో అఖిల్ మాత్రమే కాదు నిర్మాతలు సైతం భారీ నష్టాలను చవి చూసారు. ఇదిలా ఉంటే ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోయే ప్రాజెక్టు గురించి గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన UV క్రియేషన్స్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఏజెంట్ తర్వాత వెంటనే UV క్రియేషన్స్ తో అఖిల్ సినిమా చేయాల్సింది.

కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం UV క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అఖిల్ హీరోగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించబోతున్నారట. ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ తో 100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి UV క్రియేషన్స్ ముందుకు రావడం విశేషం అని చెప్పాలి.

బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న హీరోతో భారీ బడ్జెట్ తో సినిమా చేయడం నిర్మాతలకు పెద్ద రిస్క్ అనే చెప్పాలి. మరోవైపు ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈసారైనా కంటెంట్ ఉన్న కథను ఎంచుకొని విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలతో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే UV క్రియేషన్స్ ద్వారా అఖిల్ కి ఈ ప్రాజెక్టు మరో రీ లాంచ్ అవుతుందని చెప్పొచ్చు.