Begin typing your search above and press return to search.

అఖిల్ పెళ్లి అంత సింపుల్ గా అందుకేనా?

కానీ అఖిల్ విష‌యంలో మాత్రం నాగ్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎంత వీలైంత అంత సింపుల్ గా కానిచ్చే సారు.

By:  Tupaki Desk   |   7 Jun 2025 11:47 AM IST
అఖిల్ పెళ్లి అంత సింపుల్ గా అందుకేనా?
X

సెల‌బ్రిటీల పెళ్లంటే ఏ రేంజ్ లో జ‌రుగుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. నెల రోజుల ముందు నుంచే హ‌డావుడి మొద‌ల‌వుతుంది. సోష‌ల్ మీడియాలో వెడ్డింగ్ కార్డులు వైర‌ల్ అవ్వ‌డం....ఎవ‌రెవ‌ర్నీ ఆహ్వా నించారు? ఎంత మంది పెద్ద స్టార్లు హాజ‌ర‌వుతున్నారు? ఏ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి ఏ న‌టుడు వ‌స్తున్నాడు? ఇలా చాలా హంగామా ఉంటుంది నెట్టింట‌. పెళ్లి తేదీ ద‌గ్గ‌ర ప‌డే కొద్ది ఆ హైప్ ఇంకా పెరుగుతుంది.

చివ‌రిగా మూడు రోజుల పెళ్లి ఓ రేంజ్ లో మారు మ్రోగుతుంది. తొలి రోజు హల్దీ, మెహందీ, సంగీత్ వంటి వేడుకలు ఉంటాయి. రెండవ రోజు వివాహం జరుగుతుంది. మూడవ రోజున భారీ ఎత్తున‌ రిసెప్షన్ ఉంటుంది. కానీ అక్కినేని అఖిల్ పెళ్లి విష‌యంలో ఈ హ‌డావుడి అంతా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అస‌లు అఖిల్ పెళ్లి జ‌రుగుతుంది? అన్న విష‌య‌మే బ‌య‌ట‌కు పొక్క‌లేదు. అఖిల్ వివాహం ముంబైకి చెందిన జైన‌బ్ ర‌వ్జీతో ఎంతో నిరాడంబ‌రంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఇండ‌స్ట్రీ నుంచి కేవ‌లం కొద్ది మంది అతిధులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అక్కినేని కుటుంబ స‌భ్యులు ...ఇంకా స‌న్నిహితులు...స్నేహితులు ఇలా అతి కొద్ది మంది స‌మ‌క్షంలోనే వేడుక జ‌రిగింది. ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖుల్ని కూడా ఆహ్వానించారు. అయితే ఆ విష‌యాలేవి బ‌య‌ట‌కు రాలేదు. అఖిల్ వివాహాన్ని నాగార్జున చాలా సింపుల్గా తేల్చేసారు. పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య వివాహం మాత్రం భారీ ఎత్తున జ‌రిగింది.

కానీ అఖిల్ విష‌యంలో మాత్రం నాగ్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎంత వీలైంత అంత సింపుల్ గా కానిచ్చే సారు. తాను పెద్ద స్టార్ అని ....వేల కోట్లు ఆస్తులున్నాయ‌నే ప‌ర‌ప‌తిని చూపించుకోలేదు. అఖిల్ -జైన‌బ్ ఒక‌ర్ని ఒక‌రు అర్దం చేసుకోవ‌డానికి చాలా స‌మ‌యం ఇచ్చారు. నిశ్చితార్దం త‌ర్వాత ప‌ది నెల‌ల పాటు స‌మ‌యం ఇచ్చారు. అనంత‌ర‌మే వివాహ వ‌ర‌కూ వెళ్లారు.

అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్లు అంత‌గా క‌లిసి రాలేదన్న‌ది వాస్త‌వం. నాగ‌చైత‌న్య తొలుత స‌మంత‌ను వివాహం చేసుకోవ‌డం విడిపోవ‌డం తెలిసిందే. అలాగే నాగార్జున మేన‌ల్లుడు, న‌టుడు స‌మంత్ కూడా కీర్తి రెడ్డిని వివాహం చేసుకుని విడిపోయారు. రెండ‌వ పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేన‌ట్లు వెల్ల‌డించారు. మేన కోడ‌లు సుప్రియ కూడా వివాహానికి దూరంగానే ఉన్నారు. నాగార్జున కూడా అమ‌ల‌ను రెండ‌వ వివాహం చేసుకున్నారు. తొలుత నాగార్జున రామానాయుడు కుమార్తెను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.