పెళ్లిలో అక్కినేని కోడళ్ల అచ్చటా ముచ్చటా
తోటి కోడళ్ల మధ్య స్నేహం, సాన్నిహిత్యం గురించి వినే కథలు చాలా రేర్. ఒకరికొకరు ఎదురుపడితే అగ్గి మీద గుగ్గిలం అయ్యే కథలే ఎక్కువగా కనిపిస్తాయి.
By: Tupaki Desk | 30 Jun 2025 12:31 AM ISTతోటి కోడళ్ల మధ్య స్నేహం, సాన్నిహిత్యం గురించి వినే కథలు చాలా రేర్. ఒకరికొకరు ఎదురుపడితే అగ్గి మీద గుగ్గిలం అయ్యే కథలే ఎక్కువగా కనిపిస్తాయి. అది ఇంటింటి రామాయణంలోని కథల్లో పొందుపర్చబడి ఉన్నాయి. నయా బుల్లితెర సీరియళ్లలో ప్రతిరోజూ ఇవే కథలు కనిపిస్తాయి.
అదంతా సరే కానీ.. ఇక్కడ అక్కినేని వారి పెళ్లిలో తోటి కోడళ్ల ముచ్చట్లు చూసారా? ఆ ఇద్దరి అచ్చటా ముచ్చటా ఎంత ముద్దొచ్చేస్తోందో కదా! అక్కినేని అఖిల్ పెళ్లిలో అఖిల్ ఫియాన్సీ జైనాబ్ తో శోభిత ధూళిపాల ఎంతో సరదాగా కలిసిపోయి ముచ్చట్లు పెట్టడమే కాదు.. నవ్వులు చిందిస్తూ, మురిపెంగా తన తోటికోడలిని ప్రేమగా చూసుకుంది. ఇది నిజంగా అరుదైన క్షణం. అక్కినేని ఇంటి తోటికోడళ్ల ముచ్చట్లు ఫోటోలు, వీడియోల రూపంలో రికార్డయ్యాయి. వదిన శోభిత తన భార్య జైనాబ్ తో ఇంత సరదాగా ఛీర్ చేస్తుంటే, అఖిల్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ వేదిక ఆద్యంతం నాగార్జున, అమల మోములో నవ్వులు వెల్లివిరిసాయి.
జూన్ 6న హైదరాబాద్ లో అఖిల్ అక్కినేని- జైనబ్ రావ్‌జీ వివాహం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోగ్రాఫర్ షేర్ చేసిన ఫోటోలలో అఖిల్ సోదరుడు నాగ చైతన్య - వదిన శోభిత ధూళిపాళ నూతన వధూవరులతో సరదా క్షణాలను ఆస్వాధిస్తున్న ఫోటోలు ఎంతో ముచ్చట గొలిపాయి. ముఖ్యంగా పెద్ద కోడలు చిన్న కోడలు కలుసుకున్నప్పటి మధుర క్షణాలు మరపురానివి.
