కళావతి కసెక్కించే పెర్పార్మెన్స్ ఇస్తోందా!
కానీ ఆన్ సెట్స్ లో కీర్తి సురేష్ బోల్డ్ అప్పిరియన్స్ తో ఆకట్టుకుంటుందని నెట్ ప్లిక్స్ వర్గాల నుంచి లీకైంది.
By: Tupaki Desk | 7 Jun 2025 9:30 AMబాలీవుడ్ వెబ్ సిరీస్ 'అక్క'తో కీర్తి సురేష్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. తిరుగుబాటు దారుల కుట్రలను తిప్పికొట్టే రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సిరీస్ ఇది. ఇదే సిరీస్ తో ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో రాధిక ఆప్టే మరో కథానాయికగా నటిస్తుంది. అంటే రాధికతో కీర్తి సురేష్ పోటీ పడి నటించాల్సిన పరిస్థితి ఇది.
ప్రస్తుతం సెట్స్ లో ఉన్న సిరీస్ గురించి మరిన్ని విషయాలు లీక్ అయ్యాయి. ఇందులో కీర్తి సురేష్ మాఫి యా లేడీ డాన్ పాత్ర పోషిస్తుంది. కంటెట్ కాస్త బోల్డ్ గాను ఉంటుందని తొలి నుంచి ప్రచారంలో ఉంది. అలాంటి పెర్పార్మెన్స్ విషయంలో రాధికా ఆప్టే ఎక్కడా తగ్గదు. బోల్డ్ సన్నివేశాల ఎలివేషన్ పరంగా తనదైన మార్క్ వేస్తుంది. అలాగని కీర్తి సురేష్ కూడా ఎక్కడా తగ్గలేదు. తొలుత రాధికతో పోటీ పడగలదా? అన్న సందేహం వ్యక్తమంది.
కానీ ఆన్ సెట్స్ లో కీర్తి సురేష్ బోల్డ్ అప్పిరియన్స్ తో ఆకట్టుకుంటుందని నెట్ ప్లిక్స్ వర్గాల నుంచి లీకైంది. రొమాంటిక్ సన్నివేశాల్లో కీర్తి ఎక్కడా రాజీ లేకుండా నటిస్తుందిట. తెరపై ఆ సన్నివేశాలు సరికొత్త అనుభూతి పంచుతాయంటున్నారు. రాధికా ఆప్టే బోల్డ్ అప్పిరియన్స్ గురించి అందిరికీ తెలుసు. కానీ కీర్తి సురేష్ మాత్రం సినిమాల కోసమే అంత లిబర్టీ తీసుకోలేదు.
అక్క సిరీస్ కోసం మాత్రం ఎక్కడా ఆలోచిం చకుండా నటిస్తుంది. బాలీవుడ్ లో స్ట్రాంగ్ కెరీర్ ని బిల్డ్ చేసుకునే ప్రక్రియలో భాగంగా రాజీ పడటం లేదు. పోటీని ఎదుర్కుని నిలబడాలంటే ఆ మాత్రం అప్పిరి యన్స్ తప్పనిసరిగా భావించి ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తానికి 'అక్క' సిరీస్ లో సరికొత్త కీర్తిని చూడటం ఖాయమే.