అకీరా నందన్ సంగీత దర్శకత్వం?
ఏమో కానీ అకీరాలోని ఈ ట్యాలెంట్ చూసి అభిమానులు మంత్రముగ్ధులైపోతున్నారు. అకీరాలో చాలా ట్యాలెంట్ ఉంది అంటూ అంతా సంబరపడిపోతున్నారు.
By: Tupaki Desk | 16 Jan 2024 7:49 AMపాటపై మనసు పడటం వేరు.. సంగీత హోరులో తరించిపోవడం వేరు. ఈ రెండో కేటగిరీలో ఉంది గనుకే కమల్ హాసన్ వారసురాలు శ్రుతిహాసన్ ఇప్పటికీ సంగీతంపై తన మోజును విడిచిపెట్టదు. సంగీతకారిణిగా, గాయనిగా ఇప్పటికీ జాజ్ బ్యాండ్ కార్యక్రమాల్ని ఆపలేదు. నిరంతరం అభిమానులను తనదైన గానాలాపనతో అలరిస్తూనే ఉంది.
సంగీతంపై ఆసక్తి ఉన్న మరో స్టార్ కిడ్ ఎవరు? అంటే ఇప్పుడు అకీరా నందన్ వైపు చూపిస్తున్నారు. అకీరా ఇటీవల బెంగళూరు ఫామ్ హౌస్ లో మెగా సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు.. అక్కడ పియానో వాయిస్తూ తనలోని సంగీత కళాకారుడిని అతడు పరిచయం చేసాడు. డాడ్ పవన్ లాగా స్టార్ అవుతాడా ? లేక అజ్ఞాతవాసి సంగీత దర్శకుడిలాగా తాను కూడా సంగీతం బాట పడతాడా! ఏమో కానీ అకీరాలోని ఈ ట్యాలెంట్ చూసి అభిమానులు మంత్రముగ్ధులైపోతున్నారు. అకీరాలో చాలా ట్యాలెంట్ ఉంది అంటూ అంతా సంబరపడిపోతున్నారు.
ఆరున్నర అడుగుల బుల్లెట్టులా ఉండే అకీరా నందన్ ఎక్కడ ఉన్నా అందరిలోను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఫామ్ హౌస్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కుర్రాడిగా కనిపించాడు. సాధ్యమైనంత తొందర్లోనే నటనలోకి అడుగుపెట్టేయబోతున్నాడని, ఇప్పటికే విదేశాల్లో నటన, డ్యాన్సులు, ఫైట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడని కూడా ప్రచారమవుతోంది. అయితే పవన్ కానీ, రేణు దేశాయ్ కానీ అధికారికంగా ప్రకటించే వరకూ ఇవన్నీ స్పెక్యులేషన్స్ గానే భావించాల్సి ఉంటుంది.