Begin typing your search above and press return to search.

అకీరా ఇంట్రెస్ట్ అదే.. రేణు దేశాయ్ మరో ట్విస్ట్

ఓ ఇన్ స్టా రీల్ ను పోస్ట్ చేసి అకీరా అభిరుచి ఏంటో, ఎందులో రాణించాలనుకుంటున్నాడో క్లారిటి ఇచ్చారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 2:52 PM GMT
అకీరా ఇంట్రెస్ట్ అదే.. రేణు దేశాయ్ మరో ట్విస్ట్
X

గత రెండు మూడు రోజులుగా పవర్ స్టార్ పవన కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో భిన్న కామెంట్లు వినిపిస్తుండగా.. నటి రేణూ దేశాయ్ వరుసగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. అకీరాకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదంటూ ఇన్ డైరెక్ట్ గా గట్టి సమాధానమిస్తున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఓ ఇన్ స్టా రీల్ ను పోస్ట్ చేసి అకీరా అభిరుచి ఏంటో, ఎందులో రాణించాలనుకుంటున్నాడో క్లారిటి ఇచ్చారు. అతడికి మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలిపారు. అతడు దానివైపే అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసమే యూఎస్ ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయినట్లు స్పష్టత ఇచ్చారు.

పారిస్ స్టావాంజర్ ట్రిప్ హాలీడేస్ అయిపోయాయి. ఇప్పుడు నా కొడుకు ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అవ్వడానికి అమెరికాకు వెళ్లాడు. అతడికి ఇష్టమైన మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ బిజినెస్ కోర్సులో చేరాడు. అతడు యాక్టింగ్ స్కూల్ లేదా ఇతర క్లాస్ ల్లో చేరలేదు. ఇక దీని గురించి చర్చించడం మానేయండి. అతడిపై చిత్రీకరించిన ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి అంటూ రేణు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో అండ్ కామెంట్ల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అకీరా నటనలోకి రాడా అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రీసెంట్ గా అకీరా, రేణూ దేశాయ్.. పారిస్ స్టావెంజర్ వెళ్లిన సంగతి తెలిసిందే. స్టావెంజర్ లో బాహుబలి 1 స్పెషల్ స్క్రీనింగ్ జరగగా.. రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డతో పాటు వీరిద్దరూ కూడా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అకీరాతో దిగిన ఫొటోను రాఘవేంద్రరావు షేర్ చేస్తూ.. అకీరా ఫిల్మ్ స్కూల్ లో చేరబోతున్నట్లు పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశారు. దీంతో అకీరా సినీ ఎంట్రీపై రగడ మొదలైంది.

అనంతరం రేణూ.. ఈ రగడపై స్పందిస్తూ రెండు మూడు పోస్ట్ ల వరకు చేసి పవన్ ఫ్యాన్స్ కు గట్టి కౌంటర్ లు ఇచ్చింది. అతడు ఏ స్కూల్ లోనూ జాయిన్ అవ్వట్లేదని చెప్పింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యేందుకు యూఎస్ వెళ్లాడని, కాకపోతే అది యాక్టింగ్ స్కూల్ కాదు మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ కోర్సు అంటూ బాంబు పేల్చింది.