రెయిన్ బో వర్సెస్ అకీరా నందన్
బాలీవుడ్‌లో ఇటీవల కొందరు నటవారసులు వెండితెరకు పరిచయమయ్యారు. కానీ ఎవరికీ సరైన స్పందన లేదు.
By: Tupaki Desk | 8 April 2025 10:44 PM ISTబాలీవుడ్‌లో ఇటీవల కొందరు నటవారసులు వెండితెరకు పరిచయమయ్యారు. కానీ ఎవరికీ సరైన స్పందన లేదు. ప్రజలు వారిని కనీసమాత్రంగా కూడా పట్టించుకోలేదు. అసలు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారనే హంగామా కూడా ఎంతమాత్రం లేదు. చాలా సాధాసీదాగా తెరకు పరిచయమవ్వడం ఆశ్చర్యపరిచింది. దీంతో నటవారసులు పరిచయం అయిన విధానంపై చాలా విమర్శలొచ్చాయి. కొందరు స్టార్ కిడ్స్ కనీస మాత్రంగా అయినా ప్రాక్టీస్ లేకుండా నటులు అయిపోతున్నారని విమర్శించారు.
ఒకవేళ టాలీవుడ్‌లో ఒక నటవారసుడి పరిచయం ఎలా ఉండబోతోందో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటే, కచ్ఛితంగా అది హిందీ స్టార్ల నటవారసులకు జెలసీగా మారొచ్చు. అలాంటి ఒక నటవారసుడు అకీరా నందన్. అతడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు. పైగా స్టార్ గా ఏలిన పవన్ రాజకీయాల్లోకి వచ్చి గ్రాండ్ సక్సెసవ్వడమే గాక, ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడంతో సినీరాజకీయ వర్గాల్లో ఆయన వారసుడి ప్రతి అడుగుపైనా ప్రతి కదలికపైనా ఆసక్తి నెలకొంది.
అందుకే అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడా? రాజకీయాల్లోకి వెళతాడా? అన్నది ఉత్కంఠగా మారింది. అకీరా ఇప్పటికే తండ్రి వెంట అండగా ఉంటున్నాడు. హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే అకీరా నందన్ ని రేణు దేశాయ్ హీరోగా పరిచయం చేస్తారని కూడా చాలా ముచ్చట సాగుతోంది. అకీరా విదేశాలలో నట శిక్షణ తీసుకుంటున్నాడని ప్రచారం ఉంది. అయితే అతడి సినీ ఎంట్రీపై ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ అతడు హీరోగా పరిచయమైతే అది మరో రేంజులో ఉంటుందనడంలో సందేహం లేదు. రేణుదేశాయ్ షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ లా రంగుల హరివిల్లు(రెయిన్ బో)తో పోటీపడేంత ఉజ్వలమైన భవిష్యత్ అతడికి ఉంది. తల్లిదండ్రుల నుంచి గొప్ప రూపం, ఛరిష్మాను వారసత్వంగా అందిపుచ్చుకున్నాడు. అరున్నర అడుగుల బుల్లెట్టులా ఒడ్డు పొడుగు ఉన్నోడు. అందుకే నటుడిగా అడుగుపెట్టినా, రాజకీయాల్లోకి వెళ్లినా అతడు ఏలడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎత్తయిన జలపాతం.. రెయిన్ బో.. ప్రకృతి అద్భుతం నడుమ అకీరా నందన్ ఇచ్చిన ఫోజ్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా 6.4 అడుగుల ఎత్తుతో అకీరా పర్సనాలిటీ ఆశ్చర్యపరుస్తోంది.
