Begin typing your search above and press return to search.

వైరల్ : బ్లాక్ బస్టర్ వేడుకలో అయ్యగారు

గతంలో సలార్ నిర్మాణ సంస్థ హొంబలే బ్యానర్‌ లో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య స్క్రిప్ట్‌ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:01 AM GMT
వైరల్ : బ్లాక్ బస్టర్ వేడుకలో అయ్యగారు
X

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని, రికార్డ్‌ స్థాయి వసూళ్లను నమోదు చేసింది. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు బెంగళూరు లో ఒక భారీ పార్టీని ఏర్పాటు చేశారు. అత్యంత ఖరీదైన పార్టీగా సలార్ పార్టీని బెంగళూరు మీడియా అభివర్ణించింది.

సోషల్ మీడియాలో సలార్ పార్టీకి సంబంధించిన గ్లిమ్స్ మరియు ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్‌ అయ్యాయో మనం చూశాం. ఒక భారీ అవార్డు వేడుక స్థాయిలో సలార్‌ సక్సెస్ వేడుకను నిర్వహించడం జరిగింది. ఆ వేడుకలో అక్కినేని హీరో అఖిల్‌ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సలార్‌ బ్లాక్ బస్టర్ వేడుకల్లో అఖిల్ పాల్గొనడం అది కూడా చేతికి కట్టు తో కనిపించడంతో అందరూ ఆశ్చర్యంగా చర్చించుకుంటూ ఉన్నారు. తాజాగా విడుదల అయిన సలార్ బ్లాక్ బస్టర్ వేడుక గ్లిమ్స్ లో అఖిల్ కనిపించేది క్షణ కాలం అయినా కూడా నెటిజన్స్‌ స్క్రీన్‌ షాట్స్ తీసి మరీ షేర్‌ చేసుకుంటూ ఉన్నారు.

గతంలో సలార్ నిర్మాణ సంస్థ హొంబలే బ్యానర్‌ లో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య స్క్రిప్ట్‌ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు ఎవరు, ఇతర విషయాల గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఈ మధ్య కాలంలో హొంబలే నిర్మాణ సంస్థతో అఖిల్‌ సినిమా గురించి క్లారిటీ లేకపోవడంతో సినిమా లేదేమో అని కొందరు అన్నారు. అయితే బ్లాక్ బస్టర్‌ వేడుకలో అఖిల్‌ కనిపించడంతో ఇంకా ఆ సినిమా చర్చల దశలో ఉందని, ఈ ఏడాదిలో సినిమా ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. సలార్ వేడుకలో అఖిల్ స్పెషల్‌ అట్రాక్షన్ గా నిలిచాడు.