Begin typing your search above and press return to search.

ప‌హిల్వాన్‌తో లింకులపై ఆరా.. సినీతార‌ల్లో గుబులు

హైద‌రాబాదీ పహిల్వాన్ అఖిలేష్ వ్య‌భిచార ముఠా గుట్టు ర‌ట్ట‌య్యాక‌.. అత‌డితో లింకులున్న కొంద‌రు న‌టీన‌టులు, టీవీ మూవీ ఆర్టిస్టుల‌పైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 5:00 AM GMT
ప‌హిల్వాన్‌తో లింకులపై ఆరా.. సినీతార‌ల్లో గుబులు
X

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు మాయ‌ని మ‌చ్చ‌గా మారిన డ్ర‌గ్స్ స్కాండ‌ల్ కేసులు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తూనే ఉంటాయి. అడ‌పాద‌డ‌పా టాలీవుడ్ తో ముడిప‌డిన డ్ర‌గ్స్ లింకులు భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. రంగుల ప‌రిశ్ర‌మ‌తో డ్ర‌గ్స్, మ‌గువ‌ల‌తో చీక‌టి వ్యాపారం వంటి అంశాలు విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇప్పుడు దేశ‌, విదేశీ మ‌హిళ‌ల‌తో హైద‌రాబాద్ లో ప‌లుచోట్ల గుట్టుగా వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న పాపుల‌ర్ హైద‌రాబాదీ ప‌హిల్వాన్ గుట్టు ర‌ట్ట‌వ్వ‌డంతో ఈ డొంక‌తో క‌నెక్ష‌న్ ఉన్న ప్ర‌ముఖ సినీతార‌ల‌పైనా పోలీసులు ఆరాలు తీస్తున్నార‌ని సమ‌చారం.

హైద‌రాబాదీ పహిల్వాన్ అఖిలేష్ వ్య‌భిచార ముఠా గుట్టు ర‌ట్ట‌య్యాక‌.. అత‌డితో లింకులున్న కొంద‌రు న‌టీన‌టులు, టీవీ మూవీ ఆర్టిస్టుల‌పైనా పోలీసులు ఆరాలు తీస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ద‌రు స్టార్ల గుండెల్లో గుబులు మొద‌లైంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ప‌శ్చిమ బెంగాళ్, ముంబై స‌హా ప‌లు చోట్ల నుంచి యువ‌తుల‌ను న‌గ‌రానికి ర‌ప్పించి న‌గ‌రంలోని హోట‌ళ్లు, అతిథి గృహాల్లో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ప‌హిల్వాన్ అఖిలేష్ గ‌త కొన్నేళ్లుగా ఈ దందా న‌డిపిస్తున్నా పోలీసుల‌కు చిక్క‌క‌పోవడం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అయితే ఇంత‌కాలం గుట్టుగా సాగిన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడే ఎందుకు బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. ర‌ష్యా స‌హా పలు చోట్ల నుంచి వ్య‌భిచారిణుల‌ను న‌గ‌రానికి ర‌ప్పిస్తున్నార‌ని ప‌లు మీడియాల్లో క‌థ‌నాలు సంచ‌ల‌నంగా మారాయి.

అదంతా అటుంచితే ఇటీవ‌ల అఖిలేష్ దందా బ‌య‌ట‌ప‌డ‌గానే అత‌డితో లింకులు ఉన్న స్టార్ల ఫోటోల‌ను లైవ్ లో చూపిస్తూ పాపుల‌ర్ వార్తా చానెల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీవీ చానెల్ లైవ్ లో పేరున్న తార‌ల ఫోటోలు కూడా క‌నిపించాయి. అలాగే ప‌లువురు టీవీ న‌టీమ‌ణులు, హీరోయిన్ ల ఫోటోలు కూడా క‌నిపించాయి. వీరంద‌రిపైనా పోలీసులు ఆరాలు తీస్తున్నార‌ని ప‌లు చానెళ్ల‌లో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అఖిలేష్ ప‌హిల్వాన్ తో సంబంధాలు కొన‌సాగించిన సినీస్టార్లంద‌రి గుండెల్లు గుబులు రేకెత్తుతోంద‌ని స‌మాచారం.

కొన్ని టీవీ చానెళ్లు అఖిలేష్ తో సంబంధాలున్న స్టార్ల ఫోటోల‌ను బ్ల‌ర్ చేసి ప్ర‌చురించినా కానీ ఒక మొండి వార్తా చానెల్ మాత్రం నేరుగా లైవ్ లో బ్ల‌ర్ లేని ఫోటోల‌ను టెలీకాస్ట్ చేస్తూ ప‌లువురు సినీతార‌ల ప‌రువు తీయ‌డంపైనా ఇప్పుడు వాడి వేడి చ‌ర్చ సాగుతోంది. ఏది ఏమైనా సినీప‌రిశ్ర‌మ‌తో డ్ర‌గ్స్, అమ్మాయిలతో వ్యాపారం విడ‌దీయ‌ని అనుబంధం క‌లిగి ఉన్నాయ‌ని ప‌లువురు సామాజిక వేత్త‌లు టీవీ చానెళ్ల సాక్షిగా లైవ్ లో విశ్లేషిస్తున్నారు.