Begin typing your search above and press return to search.

అఖిల్ 6.. మళ్ళీ సౌండ్ మొదలైంది!

అక్కినేని యువ హీరో అఖిల్ కమర్షియల్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   3 April 2024 4:02 AM GMT
అఖిల్ 6.. మళ్ళీ సౌండ్ మొదలైంది!
X

అక్కినేని యువ హీరో అఖిల్ కమర్షియల్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతనికి పెద్దగా అదృష్టం కలిసిరావడం లేదని చెప్పాలి. మొదటి సినిమానే భారీ బడ్జెట్ తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో హైఎండ్ లో చేసిన డిజాస్టర్ అయ్యింది. తరువాత విక్రమ్ కె కుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో హలో అంటూ లవ్ స్టోరీతో పలకరించిన సక్సెస్ రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో అఖిల్ కి సక్సెస్ ని పరిచయం చేశారు.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా అతని ఇమేజ్ ని ఏ మాత్రం పెంచలేదు. సురేందర్ రెడ్డితో చేసిన ఏజెంట్ మూవీ కచ్చితంగా తనని స్టార్ గా మార్చేస్తుందని అఖిల్ నమ్మాడు. ఆ సినిమాలో లుక్స్ పరంగా డిఫరెన్స్ చూపించడానికి పరీతంగా వర్క్ అవుట్ లు చేసి కండలు పెంచాడు. ఈ సినిమాకి థియేటర్స్ లో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికి తెలిసిందే. నిర్మాత అనిల్ సుంకరకి ఈ మూవీ భారీ నష్టాలు మిగిల్చింది. అలాగే అఖిల్ కష్టం వృధా అయిపొయింది.

అఖిల్ ఈ సినిమా చేసిన డ్యామేజ్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీని ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించబోతూ ఉండటం విశేషం. పీరియాడిక్ జోనర్ లో వార్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉండబోతోందంట. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాతో యూవీ క్రియేషన్స్ పరిచయం చేస్తోంది.

తమ ప్రొడక్షన్ లో రాధేశ్యామ్, సాహో సినిమాలకి రైటింగ్ తో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అనిల్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో ఏడాది పాటు దానిపై వర్క్ చేయించారు. అఖిల్ కి కూడా కథ నచ్చడంతో ప్రీప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసేశారంట. అఖిల్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ అప్డేట్ రాబోతుందంట.

ఈ సినిమా కోసం పొడవైన బ్రీడ్ తో అఖిల్ కనిపించబోతున్నట్లు లేటెస్ట్ గా బయటకొచ్చిన అతని లుక్స్ బట్టి తెలుస్తోంది. మూవీ కథాంశం బట్టి సినిమాలో అతను కింగ్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. దానికి తగ్గట్లుగానే అఖిల్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి ధీర అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారంట. రామ్ చరణ్ కి మగధీర లా అఖిల్ కి ఈ ధీర బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో వేచి చూడాలి.