Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో ఇకనైనా మొదలు పెడతాడా..?

అక్కినేని నట వారసుడు అఖిల్ తను చేసిన ఐదు సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్ప మిగతావేవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేదు.

By:  Tupaki Desk   |   30 March 2024 1:30 PM GMT
అక్కినేని హీరో ఇకనైనా మొదలు పెడతాడా..?
X

అక్కినేని నట వారసుడు అఖిల్ తను చేసిన ఐదు సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్ప మిగతావేవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేదు. లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో అఖిల్ చాలా డిజప్పాయింట్ అయ్యాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టి నెక్స్ట్ ఇయర్ తో పదేళ్లు కావొస్తున్నా సరే అఖిల్ ఇప్పటివరకు ఒక సాలిడ్ హిట్ కొట్టింది లేదు. తనను తాను బలంగా ప్రూవ్ చేసుకోవాలనే కసి ఉన్నా సరే అందుకు తగిన కథ దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. ఏజెంట్ తర్వాత అఖిల్ ఏ సినిమా చేస్తున్నాడని అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఇప్పటివరకు అఖిల్ తన నెక్స్ట్ సినిమా ఏంటన్నది కన్ఫర్మ్ చేయలేదు.

హోంబలే ప్రొడక్షన్స్ లో అఖిల్ సినిమా ఉంటుందని భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా డిస్కషన్స్ లో ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా గురించి కూడా ఎలాంటి క్లారిటీ రావట్లేదు. అఖిల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఉగాదికి వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ చూస్తుంటే అప్పటికి కూడా అఖిల్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా ముహూర్తం పెట్టకపోయినా జస్ట్ కాంబినేషన్ అనౌన్స్ వచ్చినా చాలని అనుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు.. అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది ఆరోజు రివీల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. హోంబలే ప్రొడక్షన్స్ లోనే ధీర అంటూ ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని టాక్. అయితే ఆల్రెడీ ఆ టైటిల్ తో రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది. సో అఖిల్ సినిమా కోసం ఆ టైటిల్ వాడే ఛాన్స్ లేదు. అఖిల్ ఈసారి పీరియాడికల్ డ్రామాతో సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తన వరకు బాగానే కష్టపడుతున్నాడు అఖిల్.

ఏజెంట్ కోసం కండలు పెంచాడు అంతేకాదు భారీ యాక్షన్ సీన్స్ కూడా చేశాడు. ఇవన్నీ చేసినా కూడా సినిమా ఆడియన్స్ ని మెప్పించలేదు. హీరో పడే కష్టంతో పాటుగా ప్రేక్షకులను మెప్పించే కథ కథనం ఉంటేనే సినిమా ఆడుతుంది. అఖిల్ కేవలం తన క్యారెక్టర్ అందుకు తను పెట్టే శ్రమ మాత్రమే కాకుండా ఓవరాల్ సినిమా అవుట్ పుట్ కూడా బాగుండేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. అఖిల్ కొట్టే సాలిడ్ హిట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి కె.జి.ఎఫ్, సలార్ మేకర్స్ తో అఖిల్ చేతులు కలుపుతున్నాడు కాబట్టి ఆ ప్రాజెక్ట్ భారీ ఇంపాక్ట్ చూపించబోతుందని చెప్పొచ్చు.