Begin typing your search above and press return to search.

అఖిల్ డైరెక్టర్ మారాడా.. అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

ఎలాగు ఏజెంట్ తర్వాత టైం తీసుకున్నాడు కాబట్టి ఈ గ్యాప్ ని కవర్ చేసేలా అటు ధీర ఇటు శ్రీకాంత్ అడ్డాల సినిమా ఒకేసారి షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అఖిల్

By:  Tupaki Desk   |   11 Aug 2023 9:16 AM GMT
అఖిల్ డైరెక్టర్ మారాడా.. అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

అక్కినేని హీరో అఖిల్ కి ఏజెంట్ ఇచ్చిన షాక్ బాగానే తగిలింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకోగా అది కాస్త తుస్సుమన్నది. ఆ సినిమా ఫెయిల్యూర్ ని అంత త్వరగా డైజెస్ట్ చేసుకోలేని అఖిల్ అలా సరదాగా విదేశాలు తిరిగొచ్చాడు.. కొద్ది పాటి గ్యాప్ తో తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు అఖిల్. అఖిల్ తన నెక్స్ట్ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తారని టాక్. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు ధీర టైటిల్ ని ఫిక్స్ చేశారట.

ఈ సినిమా తర్వాత అఖిల్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నారప్ప సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల పెద్దకాపు సినిమాతో వస్తున్నాడు. మొన్నటిదాకా తనలోని సాఫ్ట్ యాంగిల్ చూపించిన శ్రీకాంత్ అడ్డాల ఇక మీదట తను కూడా యాక్షన్, మాస్ సినిమాలు తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే పెద్దకాపు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అఖిల్ సినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల ఒక అద్భుతమైన కథ రెడీ చేసినట్టు చెప్పుకుంటున్నారు.

ఆల్రెడీ అఖిల్ ని కలిసి లైన్ చెప్పి ఓకే చేయించుకున్న శ్రీకాంత్ అడ్డాల బౌండెడ్ స్క్రిప్ట్ తో కలిసి సినిమా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. అఖిల్ కూడా ఏజెంట్ తర్వాత కథల విషయంలో మరింత ఫోకస్డ్ గా ఉన్నాడు. శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం తప్ప మిగతా అన్ని సినిమాలు పర్వాలేదు అనిపించేలా చేశాడు. అతనితో సినిమా కోసం అఖిల్ ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. అఖిల్ ధీరతో పాటు శ్రీకాంత్ అడ్డాల సినిమాను కూడా ఒకేసారి చేయాలని చూస్తున్నాడు.

ఎలాగు ఏజెంట్ తర్వాత టైం తీసుకున్నాడు కాబట్టి ఈ గ్యాప్ ని కవర్ చేసేలా అటు ధీర ఇటు శ్రీకాంత్ అడ్డాల సినిమా ఒకేసారి షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. అయితే పెద్దకాపు సినిమా రిలీజ్ తర్వాతే అఖిల్ తో శ్రీకాంత్ అడ్డాల సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ఈలోగా ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఓ పక్క జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి ఈ సినిమాలతో అయినా అఖిల్ ట్రాక్ లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి. అఖిల్ సినిమాల విషయంలో ఇన్నాళ్లు పట్టించుకోని నాగార్జున ఇక మీదట అతని కెరీర్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు.