Begin typing your search above and press return to search.

అయ్యగారి న్యూ లుక్.. కొత్త ప్రాజెక్ట్ కు రెడీ!

అయితే ఏజెంట్ మూవీ తర్వాత అక్కినేని అబ్బాయి సైలెంట్ అయిపోయారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 9:35 AM GMT
అయ్యగారి న్యూ లుక్.. కొత్త ప్రాజెక్ట్ కు రెడీ!
X

అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటించిన ఒక్క మూవీ కూడా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కాలేదు. ఎంతో కష్టపడి చేసిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. హార్డ్ వర్కౌట్స్ చేసి ఈ సినిమా కోసం మెయింటైన్ చేశారు అఖిల్. అయితే ఏజెంట్ మూవీ తర్వాత అక్కినేని అబ్బాయి సైలెంట్ అయిపోయారు. ఎక్కడా ఈవెంట్స్ లో పెద్ద కనిపించడం లేదు.

ఆ మధ్య జరిగిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ సక్సెస్ పార్టీలో సడెన్ గా కనిపించారు. దీంతో సలార్ రెండో పార్ట్‌ లో అఖిల్ నటిస్తున్నారని, దేవాకు తమ్ముడిగా కనిపిస్తారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. మరోవైపు, అఖిల్ తన నెక్స్ట్ మూవీ కోసం కొత్త దర్శకుడితో చేతులు కలపనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం ఇంకా చాలా టైమ్‌ పడుతుందట.

దీంతో అసలు అఖిల్‌ ఎందుకు అలా లేట్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కానీ ఆయన మాత్రం ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారట. అందుకోసం స్టోగా, స్టడీగా కొత్త ప్రాజెక్ట్ పనులు కానిచేస్తున్నారట. పీరియాడిక్ జోనర్ లో ఆ సినిమా తెరకెక్కనుందట. దీంతో ఖర్చు కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటోంది. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ కు కావాలనే ఎక్కువ టైం తీసుకుంటున్నారట మేకర్స్.

ఇదిలా ఉంటే.. అఖిల్ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ టీ షర్ట్ లో ఉన్న అఖిల్.. తన ఫ్రెండ్ తో దిగిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో అఖిల్ ఫుల్ గడ్డంతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో కొత్త సినిమాలో అఖిల్ లుక్ ఇదేనని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయ్యగారు చాలా రోజులకు కనిపించారని నెటిజన్లు అంటున్నారు. కొత్త సినిమాను త్వరలోనే సెట్స్ పైకి ఎక్కించడని చెబుతున్నారు.

అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ ఇలా అఖిల్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాల్ని రాబట్టలేకపోయాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా కాస్త పర్వాలేదనిపించింది. అయితే తొలి సినిమా అఖిల్ కోసం ఫాంటసీ ఎలిమెంట్‌ నే ఎంచుకున్నారు ఈ యంగ్ హీరో. మరి ఇప్పుడు అలాంటి స్టోరీనే తన కొత్త సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో అఖిల్‌ ఇప్పటికైనా హిట్ కొడతారో లేదో చూడాలి.