Begin typing your search above and press return to search.

'విశ్వంభర'తో అఖిల్‌ మూవీ లింక్‌.. అందుకే లేట్‌

యూవీ క్రియేషన్స్‌ వారు ప్రస్తుతం చిరంజీవి తో విశ్వంభర సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ స్పీడ్‌ గా జరుగుతున్న సమయంలో అఖిల్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభించడం వల్ల క్లాష్

By:  Tupaki Desk   |   6 April 2024 11:30 AM GMT
విశ్వంభరతో అఖిల్‌ మూవీ లింక్‌.. అందుకే లేట్‌
X

అక్కినేని హీరో అఖిల్‌ ఏజెంట్‌ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న నేపథ్యంలో అఖిల్ అండ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే అఖిల్‌ తదుపరి సినిమా విషయంలో చాలా ఆలస్యం అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఎట్టకేలకు అఖిల్ తదుపరి సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. సాహో సినిమాకు అసిస్టెంట్‌ దర్శకుడిగా వర్క్ చేసిన అనిల్‌ కుమార్ అనే ట్యాలెంటెడ్‌ కుర్రాడితో అఖిల్ తదుపరి సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది.

యూవీ క్రియేషన్స్‌ వారు ప్రస్తుతం చిరంజీవి తో విశ్వంభర సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ స్పీడ్‌ గా జరుగుతున్న సమయంలో అఖిల్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభించడం వల్ల క్లాష్ అయ్యే అవకాశం ఉందని భావించినట్లుగా తెలుస్తోంది.

ఈ ఏడాది ఆరంభంలోనే మొదలు అవ్వాల్సిన అఖిల్‌, అనిల్‌ కుమార్‌ ల సినిమాను ఈ వేసవిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025 సమ్మర్ లో విడుదల ప్లాన్ చేస్తున్నారట. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అఖిల్‌ కు ఇది మొదటి అతి పెద్ద కమర్షియల్‌ హిట్‌ గా నిలువబోతుంది అంటూ మేకర్స్ తో పాటు ఆయన సన్నిహితులు చాలా ధీమాతో ఉన్నారు. ఇంకా టైటిల్ కన్ఫర్మ్‌ అవ్వని ఈ సినిమా కోసం అఖిల్‌ ఫిజికల్‌ గా రెడీ అవుతున్నాడట. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది.