Begin typing your search above and press return to search.

ప్రముఖ నటుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా మరణ వార్తలు వినాల్సి వస్తుంది

By:  Tupaki Desk   |   21 Sep 2023 9:18 AM GMT
ప్రముఖ నటుడు కన్నుమూత
X

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా మరణ వార్తలు వినాల్సి వస్తుంది. ఒక విషాదం నుండి బయట పడకుండానే మరో విషాదం తో సినిమా ఇండస్ట్రీ కి చెందిన వారు బాధ పడుతూనే ఉన్నారు. నేడు బాలీవుడ్ కు చెందిన మరో నటుడు మృతి చెందారు.

ఆమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ సినిమా లో లైబ్రేరియన్‌ దూబే పాత్రలో కనిపించిన అఖిల్ మిశ్రా తన ఇంట్లోని కిచెన్ లో జారి పడటం తో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జారి పడ్డ అఖిల్ మిశ్రా ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

58 ఏళ్ల అఖిల్ మిశ్రా డాన్‌, గాంధీ మై ఫాదర్‌, షికార్ తో పాటు పలు సినిమా ల్లో నటించాడు. నటుడిగా పలు విభిన్నమైన సినిమాల్లో నటించిన అఖిల్ ఇలా హఠాత్తుగా మరణించడం తో ఆయన కుటుంబ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్ మిశ్రా మృతి పై అనుమానాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ వచ్చే వరకు ఏమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.