Begin typing your search above and press return to search.

'స‌లార్ 2'లో అఖిల్ నిజ‌మేనా?

అయితే ఈ వార్త‌లు నిజ‌మా? అంటూ ప్ర‌శాంత్ నీల్ స‌తీమ‌ణి లిఖితా రెడ్డిని నెటిజనులు ప్ర‌శ్నించ‌గా, ఆమె ఇది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మేన‌ని కొట్టి పారేసారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 3:38 AM GMT
స‌లార్ 2లో అఖిల్ నిజ‌మేనా?
X

'ఏజెంట్' చిత్రంలో చివరిసారిగా కనిపించిన అఖిల్ అక్కినేని కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నాడు. త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి ఏదీ చెప్ప‌డం లేదు. అయితే అఖిల్ త‌దుప‌రి ప్ర‌శాంత్ నీల్ స‌లార్ 2లో న‌టిస్తున్నాడంటూ ఒక పుకార్ జోరుగా షికార్ చేస్తోంది. స‌లార్ స‌క్సెస్ వేడుక‌లో అఖిల్ ప్ర‌త్య‌క్షం కావ‌డంతో పుట్టుకొచ్చిన పుకార్ ఇది.

స‌లార్ పార్ట్ 2- శౌర్యంగ పర్వం కోసం నీల్ ఇప్ప‌టికే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందులో అఖిల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని క‌థ‌నాలొచ్చాయి. దీంతో శౌర్యంగ పర్వంలో అఖిల్ ప్రమేయం గురించి తెలుసుకోవాలని నెటిజనుల్లో ఆసక్తి మొద‌లైంది. ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని నెగిటివ్ రోల్ పోషించే అవకాశం ఉందని కూడా క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఈ వార్త‌లు నిజ‌మా? అంటూ ప్ర‌శాంత్ నీల్ స‌తీమ‌ణి లిఖితా రెడ్డిని నెటిజనులు ప్ర‌శ్నించ‌గా, ఆమె ఇది కేవ‌లం రూమ‌ర్ మాత్ర‌మేన‌ని కొట్టి పారేసారు. అఖిల్ మాత్ర‌మే కాదు.. నీల్ కూడా స‌లార్ 2లో క‌నిపించ‌రు అని గుంబ‌న‌గా వ్యాఖ్యానించారు. దీంతో అఖిల్ పై వ‌చ్చిన రూమ‌ర్లు అన్నీ ట్రాష్ అని తేలిపోయింది. అఖిల్ అక్కినేని ప్రస్తుతం దర్శకుడు అనిల్ కుమార్‌తో తన తదుప‌రి చిత్రం కోసం పని చేస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'స‌లార్ పార్ట్ 1- సీజ్ ఫైర్‌' డిసెంబర్ 22 న థియేటర్లలో విడుదలైంది . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. మాస్ యాక్షన్ చిత్రంలో ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం ప్రముఖంగా ప్రశంసలు అందుకుంది. అభిమానుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఇది ఇప్పుడు అంతర్జాతీయ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 4న డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది.