Begin typing your search above and press return to search.

అఖిల్ ఫేస్ కి స‌ర్జ‌రీలా? నిజ‌మెంత‌!

అఖిల్ బ్యూటీకి మ‌రింత అందాన్ని అద్దేలా ముఖానికి అవ‌స‌ర‌మైన కొన్ని ర‌కాల స‌ర్జ‌రీలు చేయిస్తున్న‌ట్లు వినిపిస్తుంది. విదేశాల్లో కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డానికి రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   15 Oct 2023 2:30 AM GMT
అఖిల్ ఫేస్ కి స‌ర్జ‌రీలా?  నిజ‌మెంత‌!
X

అక్కినేని అఖిల్ హీరోయిక్ లుక్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'ఏజెంట్' లో స్టైలిష్ లుక్ లో అద‌ర‌గొట్టాడు. సిక్స్ ప్యాక్ తో గాళ్స్ ని హృద‌యాల్ని ఛిద్రం చేసాడు. హైట్..వెయిట్..ఫిజిక్ తో మ‌హేష్ రేంజ్ ఉన్న హీరో అన‌డంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ యంగ్ హీరో కి హిట్ ఒక్క‌టే త‌క్కువైంది. స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఒక‌టి ప‌డితే! అఖిల్ రేంజ్ నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంద‌న‌డంలో డౌట్ లేదు.

ప్ర‌స్తుతం అలాంటి స‌క్స‌స్ కోసం ద‌ర్శ‌కుడిని..మంచి క‌థ‌ని వెతికే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ జరిగిందేదో జ‌రిగిపోయింది. ఇక‌పై మ‌ళ్లీ అలాంటి త‌ప్పిదాలు దొర్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. హిట్ కంటెంట్ తోనే బాక్సాఫీస్ బ‌రిలో నిలవాలని ప‌క్కా ప్లాన్ తో బ‌రిలోకి దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అఖిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్క‌ర్లు కొడుతుంది.

అఖిల్ బ్యూటీకి మ‌రింత అందాన్ని అద్దేలా ముఖానికి అవ‌స‌ర‌మైన కొన్ని ర‌కాల స‌ర్జ‌రీలు చేయిస్తున్న‌ట్లు వినిపిస్తుంది. విదేశాల్లో కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డానికి రెడీ అవుతున్నాడు. అలాగే ముక్కుకు సంబంధించి కొన్ని ర‌కాల స‌ర్జ‌రీలు కూడా అవ‌స‌ర‌మని భావించాడుట‌. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విదేశాల‌కు వెళ్ల‌నున్నాడు అనే ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంతో తెలియాలి.

అఖిల్ నిజంగా స‌ర్జ‌రీకి వెళ్తున్నాడా? అన్న‌ది అఖిల్ గానీ...ఆ కుటుంబం గానీ ధృవీక‌రిస్తే గానీ న‌మ్మ‌డానికి వీలులేదు. ఇప్ప‌టివ‌ర‌కూ అఖిల్ గురించి ఇలాంటి ప్ర‌చారం ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. అఖిల్ కి స‌ర్జ‌రీలు చేయించుకుని మ్యాక‌ప్ వేసుకోవాల్సినంత అవ‌స‌రం కూడా లేదు. ఆయ‌న‌కు ఉన్న తాజా లుక్ తోనే ఇండ‌స్ట్రీలో బోలెడ‌న్ని వండ‌ర్స్ చేయోచ్చు. అందుకు స‌రైన క‌థ‌..ద‌ర్శ‌కుడు దొరికితే చాలు.