Begin typing your search above and press return to search.

అఖిల్ నెక్ట్స్.. డబుల్ డోస్ నిజమైతే కిక్కే

అక్కినేని యువ హీరో అఖిల్ గత ఏడాది ఏజెంట్ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:09 AM GMT
అఖిల్ నెక్ట్స్.. డబుల్ డోస్ నిజమైతే కిక్కే
X

అక్కినేని యువ హీరో అఖిల్ గత ఏడాది ఏజెంట్ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో నెక్స్ట్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. మరల ఇప్పుడో కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా అఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న మూవీ అని తెలుస్తోంది. రాధేశ్యామ్, సాహో లాంటి సినిమాలకి డైరెక్షన్, రైటింగ్ విభాగంలో పని చేసిన అనిల్ కుమార్ ఈ మూవీతో దర్శకుడి పరిచయం అవుతున్నారు.

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతోంది. అయితే ఇప్పుడు వీరికి హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్ కూడా తోడయ్యారు. అలాగే ప్రశాంత్ నీల్ సమర్పణలో సినిమాను రూపొందించనున్నారు. సలార్ తో బ్లాక్ బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న హోంబలే ఫిలిమ్స్ పై విజయ్ అన్ని భాషలలో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.

అందులో భాగంగా అఖిల్ సినిమా కోసం యూవీ వారితో జత కట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి ధీర టైటిల్ పెట్టినట్లు ఇప్పటికే టాక్ బయటకొచ్చింది. అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయడమే మిగిలింది. ఇప్పటికే మూవీ వర్క్ షాప్స్ కూడా మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడంట. అందులో ఒక పాత్ర మాస్ లుక్ లో ఉంటే మరో రోల్ స్టలిష్ లుక్ లో వైలెంట్ గా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయనటువంటి చాలెంజింగ్ క్యారెక్టర్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. కచ్చితంగా ఇది అతని యాక్టింగ్ టాలెంట్ కి పరీక్ష పెట్టే మూవీ అవ్వబోతోంది. ఇప్పటి వరకు కెరియర్ లో సాలిడ్ సక్సెస్ ని అఖిల్ సొంతం చేసుకోలేదు. యాక్టింగ్ పరంగా గొప్పగా అనిపించుకున్న సినిమా కూడా లేదు.

ధీర మూవీ మాత్రం అతనిలోకి అన్ని షేడ్స్ ని బయటకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. అందుకోసమే అఖిల్ కూడా ఈ చిత్రం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వర్క్ చేస్తున్నారు. తనని తనకు బెస్ట్ గా షోకేస్ చేసుకోవడానికి లభించే అవకాశం కరెక్ట్ గా వినియోగించుకోవాలని అనుకుంటున్నారు.