Begin typing your search above and press return to search.

మరీ ఇంతగా పెంచావేంటి అఖిలు..!

గత ఏడాది వచ్చిన ఏజెంట్‌ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఏడాది కాలంగా ఆయన పూర్తి విశ్రాంతి లో ఉన్నాడు. కొత్త సినిమా ప్రారంభం కాలేదు

By:  Tupaki Desk   |   11 April 2024 7:48 AM GMT
మరీ ఇంతగా పెంచావేంటి అఖిలు..!
X

అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్‌ 'అఖిల్‌' సినిమా తో ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ పదేళ్ల కాలంలో అఖిల్‌ నుంచి వచ్చిన సినిమాలు తక్కువే.. ఆ సినిమాల్లో హిట్స్ అంతకంటే తక్కువ. ఇప్పటి వరకు హీరోగా అయిదు సినిమాల్లో హీరోగా నటించిన అఖిల్‌ మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించుకున్నాడు.

గత ఏడాది వచ్చిన ఏజెంట్‌ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఏడాది కాలంగా ఆయన పూర్తి విశ్రాంతి లో ఉన్నాడు. కొత్త సినిమా ప్రారంభం కాలేదు. అయితే ఎన్నో కథలను విన్న అఖిల్‌ తన ఫిజిక్ ను మరియు లుక్ ని కూడా మార్చుకుని కొత్త సినిమాకు రెడీ అయ్యాడు.

యూవీ క్రియేషన్స్ లో అఖిల్‌ కొత్త సినిమా ఏ క్షణంలో అయినా ప్రారంభోత్సవం కు రెడీ అన్నట్లుగా ఉంది. అనిల్‌ కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ మూవీ ఉండబోతుంది. ఈ మధ్య కాలంలో ఈ అఖిల్‌ మీడియాలో కనిపించడం చాలా తక్కువ అయ్యింది. చాలా రోజుల క్రితం సలార్‌ సక్సెస్ వేడుకలో కనిపించిన అఖిల్‌ మళ్లీ ఇన్నాళ్లకు ఎయిర్ పోర్ట్‌ లో కనిపించాడు.

తన పుట్టిన రోజు ను విదేశాల్లో జరుపుకునేందుకు వెళ్లిన అఖిల్ తిరిగి వచ్చే సమయంలో ఇలా ఎయిర్ పోర్ట్‌ లో కనిపించాడు. ఆ మధ్య కనిపించిన సమయం లోనే పొడవాటి జుట్టు మరియు గడ్డం తో కనిపించాడు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా జుట్టు మరియు గడ్డం ఉంది. మరీ ఇంత జుట్టు ఎందుకు అఖిల్ అంటూ కొందరు నెట్టింట ప్రశ్నింస్తున్నారు.

తెలుగు హీరోలకు అది కూడా అఖిల్‌ లాంటి యంగ్‌ హీరోలకు ఇలాంటి హెయిర్ స్టైల్ ను తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. అలాంటిది అఖిల్‌ మరీ ఇంతగా జుట్టు పెంచాడు ఏంటి.. సినిమా ప్రారంభం నాటికి ఈ జుట్టు ఇలాగే ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్‌ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేయబోతున్నాడు. దర్శకుడు అనిల్ కుమార్‌ చెప్పిన కాన్సెప్ట్‌ మరియు కథ నచ్చడంతో అఖిల్‌ చాలా ఆసక్తిగా షూటింగ్‌ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాడట. వచ్చే ఏడాది సమ్మర్ కి అఖిల్‌, అనిల్‌ కుమార్‌ మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.