Begin typing your search above and press return to search.

అఖిల్.. ఒకేసారి రెండు!

ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో ధీర టైటిల్ తో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 4:16 AM GMT
అఖిల్.. ఒకేసారి రెండు!
X

అక్కినేని యువ హీరో అఖిల్ ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం కోసం అఖిల్ ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది. అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం మూవీతో రాలేదు. ఇదంతా సురేందర్ రెడ్డి కారణంగానే జరిగిందని నిర్మాత అనిల్ సుంకర కూడా డైరెక్ట్ గానే చెప్పారు. స్క్రిప్ట్ ప్రొపర్ గా సిద్ధం కాకపోవడమే ఏజెంట్ ఫెయిల్యూర్ కి కారణం అన్నారు.

అయితే ఏజెంట్ మూవీ తర్వాత అఖిల్ ఇప్పటి వరకు మీడియా కంట పడలేదు. సైలెంట్ గా ఉన్నాడు. ఏజెంట్ ఫెయిల్యూర్ ఆలోచనల నుంచి పూర్తిగా బయటపడే ప్రయత్నం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మరో వైపు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ లో ధీర టైటిల్ తో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.

మరో వైపు టెక్నీషియన్స్, క్యాస్టింగ్ సెలక్షన్ కూడా అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు. పీరియాడిక్ జోనర్ లో కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో రాజుల కాలం నాటి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందంట. యూవీ వాళ్ళు కూడా భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నారు.

మరో వైపు శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ యాక్షన్ థ్రిల్లర్ కథని అఖిల్ ని నేరేట్ చేసి ఫైనల్ చేసుకున్నారంట. ప్రస్తుతం శ్రీకాంత్ పెద్దకాపు సిరీస్ పై ఉన్నారు. ఇందులో మొదటి భాగం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కథలోని హై ఇంటెన్షన్ ని ప్రెజెంట్ చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సారి ఫ్యామిలీ డైరెక్టర్ గా కాకుండా యాక్షన్ తో తన సత్తా చాటాలని అనుకుంటున్నారు.

ఇక అఖిల్ కోసం కూడా పవర్ ఫుల్ యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యూవీలో చేయబోయే సినిమాతో పాటు శ్రీకాంత్ అడ్డాల ప్రాజెక్ట్ కూడా ఒకే సారి సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని అఖిల్ భావిస్తున్నారంట. నెక్స్ట్ ఇయర్ గ్యాప్ లేకుండా కంప్లీట్ షూటింగ్స్ తో బిజీగా ఉండాలని భావిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలు ఎప్పుడు అఫీషియల్ గా ఎనౌన్స్ అవుతాయి. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయనేది తెలియాల్సి ఉంది.