Begin typing your search above and press return to search.

అఖిల్‌ పై వంద కోట్లు.. అందుకే ఆలస్యం!

అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు ఆయన నుంచి అయిదు సినిమాలు వచ్చాయి

By:  Tupaki Desk   |   18 Nov 2023 5:47 AM GMT
అఖిల్‌ పై వంద కోట్లు.. అందుకే ఆలస్యం!
X

అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఇప్పటి వరకు ఆయన నుంచి అయిదు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి రెండు పర్వాలేదు అనిపించుకోగా మిగిలిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా అఖిల్ నుంచి వచ్చిన తాజా చిత్రం 'ఏజెంట్‌' ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో అందరికి తెల్సిందే.

సురేందర్‌ రెడ్డి దాదాపుగా రూ.80 కోట్లు ఖర్చు చేసి ఏజెంట్‌ సినిమాను రూపొందిస్తే కనీసం 8 కోట్ల షేర్‌ ను కూడా ఆ సినిమా రాబట్టలేక పోయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్‌ మీమ్స్ వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే అఖిల్‌ కొత్త సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్ని ఫ్లాప్స్ పడ్డా కూడా అఖిల్‌ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు.

ఆ క్రేజ్ కారణంగానే ఆయన తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. అఖిల్‌ తదుపరి సినిమాను యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మించబోతున్నారు. ఈ సినిమా తో యూవీ వారు అనిల్‌ కుమార్‌ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు. కొత్త దర్శకుడు, ఫ్లాప్‌ హీరో అయినా కూడా యూవీ వారు ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ ని ఖర్చు చేయబోతుందట.

అనిల్‌ కుమార్‌ చెప్పిన స్క్రిప్ట్‌ పై చాలా నమ్మకంగా ఉన్న యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు ఏకంగా వంద కోట్ల బడ్జెట్‌ తో రెడీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌ వర్క్ జరుపుతున్నారు. త్వరలోనే షూటింగ్‌ ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

స్టోరీ లైన్ పట్ల నాగ్‌ మరియు అఖిల్ లు చాలా ఆసక్తి కనబర్చారు. ఫైనల్ స్క్రిప్ట్‌ విన్న తర్వాత వారు ఓకే చెప్తే షూటింగ్‌ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థం లో సినిమా షూటింగ్‌ మొదలు పెట్టి 2025 లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.