Begin typing your search above and press return to search.

అఖిల-జైనాబ్‌ వెడ్డింగ్‌... ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

ఫైనల్లీ అఖిల్‌-జైనాబ్‌ ల వివాహ రిసెప్షన్‌కు ప్లాన్‌ చేశారు. జూన్‌ 8న సాయంత్రం 7:30 గంటలకు రిసెప్షన్‌ ప్రారంభం కాబోతుంది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 11:23 AM IST
అఖిల-జైనాబ్‌ వెడ్డింగ్‌... ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌
X

అక్కినేని ఫ్యామిలీ ఇంట వివాహం అంటే ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. అలాంటిది అఖిల్‌ పెళ్లి అంటే ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకుంటారు. అందరు కాకున్నా కనీసం కొద్ది మంది ఫ్యాన్స్‌కి అయినా ఆహ్వానం ఉంటుంది. అఖిల్‌ అక్కినేని పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోలో సింపుల్‌గా జరిగింది. తక్కువ మంది సెలబ్రిటీల సమక్షంలో, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య వివాహం జరిగింది. వివాహం గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. పెళ్లికి ప్రముఖులు వచ్చినట్లుగా కనిపించలేదు కనుక.. ఎక్కువ శాతం మంది కచ్చితంగా వివాహ రిసెప్షన్‌కి వచ్చే అవకాశం ఉందని అక్కినేని ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతోంది.

పెళ్లి జరిగి దాదాపుగా రెండు రోజులు అవుతుంది, ఇప్పటి వరకు రిసెప్షన్‌ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోవడం పట్ల అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడు ప్రకటన వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ అఖిల్‌-జైనాబ్‌ ల వివాహ రిసెప్షన్‌కు ప్లాన్‌ చేశారు. జూన్‌ 8న సాయంత్రం 7:30 గంటలకు రిసెప్షన్‌ ప్రారంభం కాబోతుంది. ఈ వివాహ రిసెప్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోంది. అందుకే ఈ వివాహ రిసెప్షన్‌కి భారీ ఎత్తున పోలీసులతో పాటు ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేయించారని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా నాగార్జున దంపతులు వెళ్లి ఆహ్వానించారు. కనుక కచ్చితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అక్కినేని వీరాభిమానుల్లో కొందరికీ ఆహ్వానాలు అందాయి అనేది సమాచారం. ఇప్పటికే ఫ్యాన్స్ మెల్ల మెల్లగా అన్నపూర్ణ స్టూడియో ముందుకు చేరుకుంటున్నారు. అక్కడ జనాలు లేకుండా చెదురగొట్టేందుకు పోలీసులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సైతం ఈ వివాహ నిశ్చితార్థంకు హాజరు అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మీడియా వారికి ఆహ్వానం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కొద్ది మంది ఫ్యాన్స్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యి కొత్త దంపతులు అయిన అఖిల్‌-జైనాబ్‌ రాన్జీలను ఆశీర్వదించబోతున్నారు. వివాహ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇంకా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రిసెప్షన్‌ జరుగబోతున్న నేపథ్యంలో ఆ ఫోటోలు, వీడియోల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. పెళ్లిలో సాంప్రదాయ లుక్‌లో కనిపించిన ఈ జంట రిసెప్షన్‌లో ఎలా కనిపిస్తారు అనేది చూడాలి. ఇక నాగ చైతన్య-శోభిత జంట సైతం రిసెప్షన్‌లో ఎలా కనిపిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రమే కాకుండా దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ సైతం ఈ రిసెప్షన్‌కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.