బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్పిన అఖిల్
టాలీవుడ్ హీరో నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం తెల్లవారుఝామున మూడు గంటలకు వేద మంత్రాల సాక్షిగా అఖిల్ తన ప్రేయసి జైనబ్ మెడలో మూడు ముళ్లు వేశాడు.
By: Tupaki Desk | 6 Jun 2025 10:52 AM ISTటాలీవుడ్ హీరో నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. శుక్రవారం తెల్లవారుఝామున మూడు గంటలకు వేద మంత్రాల సాక్షిగా అఖిల్ తన ప్రేయసి జైనబ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని నాగార్జున నివాసంలో వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.
అయితే ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో సహా అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి- సురేఖ, రామ్ చరణ్- ఉపాసన దంపతులతో పాటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో సుమంత్, శర్వానంద్ కూడా పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత జరిగిన బరాత్ లో హీరో నాగ చైతన్య ఎంతో యాక్టివ్ గా పాల్గొన్నాడు.
ప్రస్తుతం ఆ బరాత్ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాగా జూన్ 8న అక్కినేని కొత్త జంటకు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు నాగార్జున. ఎంతో గ్రాండ్ గా జరగనున్న ఈ రిసెప్షన్ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటూ పారిశ్రామిక వేత్తలు కూడా హాజరుకానున్నారు.
గతేడాది నవంబర్ లోనే అఖిల్- జైనబ్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటికీ అదే టైమ్ లో నాగచైతన్య- శోభిత పెళ్లి పనులు మొదలవడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. హైదరాబాద్ లోనే పుట్టిన జైనబ్ రవ్‌జీ ఓ ఆర్టిస్ట్. రిఫ్లెక్షన్ పేరుతో నిర్వహించిన ఓ పెయింట్ ఎగ్జిబిషన్ లో ఆమె వేసిన పెయింటింగ్స్ ను ప్రదర్శించారట. జైనబ్ తండ్రి జుల్ఫీ రవ్‌జీ కన్‌స్ట్రక్షన్ రంగంలో పెద్ద బిజినెస్ టైకూన్ అని సమాచారం.
