అఖిల్ లెనిన్ లో ఊహించని సర్ ప్రైజ్..?
అక్కినేని అఖిల్ ఏజెంట్ తర్వాత లెనిన్ సినిమాతో వస్తున్నాడని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 16 Jun 2025 8:30 AM ISTఅక్కినేని అఖిల్ ఏజెంట్ తర్వాత లెనిన్ సినిమాతో వస్తున్నాడని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మురళి కిషోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం తో వినరో భాగ్యము విష్ణు కథ తీసి సక్సెస్ అందుకున్న మురళి కిషోర్ నెక్స్ట్ ఛాన్స్ కి కాస్త టైం తీసుకున్నా ఈసారి మరింత క్రేజీ సినిమాతో రాబోతున్నాడని అర్ధమవుతుంది. అఖిల్ సినిమాపై రకరకాల రూమర్స్ వచ్చాయి. ఏజెంట్ తర్వాత రెండేళ్లు అఖిల్ ఖాళీగా ఉన్నాడు.
ఐతే అఖిల్ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి లెనిన్ అంటూ వచ్చిన టీజర్ సూపర్ బజ్ ఏర్పరచుకుంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఐతే ఈ సినిమా నిర్మాణంలో కింగ్ నాగార్జున కూడా భాగం అవుతున్నారు. అఖిల్ కి ఎలాగైనా ఒక సూపర్ హిట్ ఇవ్వాలనే ఆలోచనతో నాగార్జున ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారని తెలుస్తుంది.
ఐతే కేవలం నిర్మంచడమే కాదు నాగర్జున అఖిల్ లెనిన్ ఒక సర్ ప్రైజ్ క్యామియో కూడా చేస్తారంటూ టాక్ వినబడుతుంది. నాగార్జున సినిమాల్లో అఖిల్ క్యామియో తెలిసిందే. అఖిల్ తొలిసారి స్క్రీన్ మీద కనిపించింది మనం సినిమాలోనే. ఇక ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి తెర మీద కనిపించలేదు. నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్ కథలు వెతుకుతున్నా ఏది అంతగా నచ్చట్లేదు
అందుకే అఖిల్ చేస్తున్న లెనిన్ లో ఈసారి నాగార్జున క్యామియో రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. అదే నిజం అయితే అఖిల్ సినిమాకు సూపర్ బూస్ట్ వస్తుందని చెప్పొచ్చు. అక్కినేని హీరోల్లో నాగ చైతన్య తనకు సూటయ్యే కథలు చేస్తూ కెరీర్ నడిపిస్తున్నాడు. అఖిల్ కూడా ఏజెంట్ తర్వాత నిరీక్షణకు బ్రేక్ ఇచ్చి లెనిన్ తో వస్తున్నాడు. నాగార్జున కూడా సినిమాలో కనిపిస్తే సినిమాకు మరింత క్రేజ్ ఉంటుంది. మరి లెనిన్ లో కింగ్ ఉన్నాడా లేడా అన్నది త్వరలో తెలుస్తుంది.
అఖిల్ ఈ సినిమా తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా మరో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. హోంబలె ప్రొడక్షన్స్, యువి క్రియేషన్స్ అఖిల్ తో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్టు టాక్. ఐతే ఆ బ్యానర్ లు చేసే సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు అని తెలుస్తుంది. మరి అఖిల్ నెక్స్ట్ సినిమాల అప్డేట్ బయటకు రావాల్సి ఉంది.
