Begin typing your search above and press return to search.

అఖిల్ కోసం ఎన్ని చేయాలో అన్ని..

ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ల వైపు క్యూ కడుతున్న కరెక్ట్ టైమ్ లో అక్కినేని ఫ్యాన్స్ అంతా జూలై 10వ తేదీ వైపు చూస్తున్నారు. అఖిల్ లేటెస్ట్ ప్రాజెక్ట్ లెనిన్ అదే రోజు రిలీజ్ కానుంది.

By:  M Prashanth   |   23 Jun 2026 12:40 PM IST
అఖిల్ కోసం ఎన్ని చేయాలో అన్ని..
X

టాలీవుడ్ బాక్సాఫీస్ కి మళ్ళీ పాత కళ వచ్చేసింది. సమ్మర్ మొత్తం ఈసారి చేజారిపోయింది. IPL వలన కూడా కొందరు వెనక్కి తగ్గారు. ఇక ఆ తరువాత పెద్ది వచ్చి ఓపెనింగ్స్ తోనే సాలీడ్ బూస్ట్ ఇచ్చింది. రీసెంట్ గా వచ్చిన మా ఇంటి బంగారం సక్సెస్ తో కూడా థియేటర్ల దగ్గర మళ్ళీ కోలాహలం మొదలైంది. ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ల వైపు క్యూ కడుతున్న కరెక్ట్ టైమ్ లో అక్కినేని ఫ్యాన్స్ అంతా జూలై 10వ తేదీ వైపు చూస్తున్నారు. అఖిల్ లేటెస్ట్ ప్రాజెక్ట్ లెనిన్ అదే రోజు రిలీజ్ కానుంది.

ఈసారి అఖిల్ కి ఉన్న సాలిడ్ బ్యాకప్ చూస్తుంటే ప్లానింగ్ మామూలుగా లేదని అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు బడా నిర్మాణ సంస్థలు ఈ సినిమా కోసం చేతులు కలిపాయి. అన్నపూర్ణ స్టూడియోస్ కి ఉన్న బ్రాండ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దానికి తోడు ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ జత కలవడం మామూలు విషయం కాదు. ఒక క్లాస్ లెగసీ ఉన్న బ్యానర్ కి, పక్కా మాస్ పల్స్ తెలిసిన సంస్థ తోడు కావడంతో లెనిన్ ప్రాజెక్ట్ కి ఒక స్ట్రాంగ్ పవర్ దొరికింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే వాళ్ల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో తెలుస్తుంది. మ్యాడ్, టిల్లు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో నేటి యూత్ కి ఏం కావాలో వాళ్లు ఎప్పుడో ప్రూవ్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ గా ప్యాక్ చేయడంలో ఆ టీమ్ కి ఒక సపరేట్ స్టైల్ ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే మాస్ కమర్షియల్ మీటర్ ని అఖిల్ స్టైలిష్ అప్పియరెన్స్ కి యాడ్ చేసి ట్రేడ్ వర్గాల్లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వల్ల సినిమా బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.

ప్రమోషన్స్ విషయంలో కూడా అఖిల్ గత సినిమాల ఛాయలు ఎక్కడా కనిపించట్లేదు. లెనిన్ టీజర్లు, క్యారెక్టర్ ఇంట్రోలు, పోస్టర్ కట్స్ గమనిస్తే అందులో సితార వాళ్ల అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా స్పష్టంగా కనబడుతోంది. ఏ పాయింట్ ని హైలైట్ చేస్తే జనాల్లోకి సినిమా ఫాస్ట్ గా వెళ్తుందో కరెక్ట్ గా ఆ పాయింట్ నే టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ఇలాంటి అగ్రెసివ్ ప్రమోషన్స్ అఖిల్ కు ఇప్పుడు చాలా ప్లస్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వీళ్ల హంగామా ఓ రేంజ్ లో నడుస్తోంది.

ఇక రిలీజ్ రోజు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ మాత్రం భారీగా రావడం పక్కా అని బయ్యర్లు ఫిక్స్ అయిపోయారు. సితార సంస్థకు ఉన్న స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వల్ల నైజాం, ఆంధ్రాలో థియేటర్ల కౌంట్ ఆటోమేటిక్ గా భారీ స్థాయిలో దొరుకుతుంది. ఆ స్ట్రాంగ్ నెట్వర్క్ తో పడే ఫస్ట్ డే కలెక్షన్స్ నంబర్స్ చూసి ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం అని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

అఖిల్ కి ఒక సాలిడ్ కమర్షియల్ బ్రేక్ రావాలని అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సరైన కంటెంట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయో తెలిసిందే. ఇప్పుడు దానికి మించిన ప్లానింగ్, అగ్రెసివ్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ బ్యాకప్ అన్నీ లెనిన్ ప్రాజెక్ట్ కి సెట్ అయ్యాయి. దర్శకుడు మురళి అనుకున్న కంటెంట్ కాస్త క్లిక్ అయితే చాలు అఖిల్ కెరీర్ కి ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిపోతుంది.