దళపతి కొడుకుతో అఖిల్.. ప్లాన్ ఏంటీ?
ఇప్పుడు వీరి ముగ్గురితో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కనిపించారు. దీంతో అందుకు సంబంధించిన ఆ ఫోటో.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
By: Tupaki Desk | 10 May 2025 8:59 AMకోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. హీరో సందీప్ కిషన్ తో తన డెబ్యూ మూవీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. రీసెంట్ గా సందీప్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
అయితే సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు వీరి ముగ్గురితో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కనిపించారు. దీంతో అందుకు సంబంధించిన ఆ ఫోటో.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సందీప్- జాసన్ మూవీ షూటింగ్ సెట్స్ కు అఖిల్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అంతా కలిపి ఫోటోకు పోజ్ ఇచ్చినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఆ పిక్ కు సెల్ఫీ టైమ్.. ద బాయ్స్ ఆర్ హేవింగ్ క్రేజీ డే అవుట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెటిజన్లు.. కొత్త అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
జాసన్ సంజయ్ తో అఖిల్ ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా అంటూ డౌట్ పడుతున్నారు. ఏదో పెద్ద ప్లాన్ చేసినట్లు ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరం కలిసి వర్క్ చేయడం గ్యారెంటీలా ఉందే అని కొందరు అంటుంటే.. మరికొందరు క్యాజువల్ గా కలిశారేమోనని చెబుతున్నారు. మొత్తానికి ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే చాలా కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్.. ఇప్పుడు లెనిల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమాలో మాస్ అవతార్ లో అఖిల్ కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది.
మరోవైపు, జాసన్ సంజయ్ తీస్తున్న డెబ్యూ మూవీ హై-బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఫిల్మ్ మేకింగ్ చదివి టొరంటో ఫిల్మ్ స్కూల్ లో డిప్లొమా పొందిన జాసన్.. లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో బీఏ (ఆనర్స్) పట్టా పొందారు. విజయ్ మూవీతో 2009లో బిగ్ స్క్రీన్ పై కనిపించగా.. ఇప్పుడు డైరెక్టర్ గా పరిచయం కానున్నారు.