అక్కినేని వారసుడు బర్త్ డేకి బ్లాస్ట్ చేస్తాడా?
అక్కినేని వారసుడు అఖిల్ కొత్త సినిమా ఆలస్యమైనా బ్యాక్ టూ బ్యాక్ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 March 2025 11:46 AM ISTఅక్కినేని వారసుడు అఖిల్ కొత్త సినిమా ఆలస్యమైనా బ్యాక్ టూ బ్యాక్ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. `ఏజెంట్` ప్లాప్ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయినా? ఆ మౌనం వెనుక పెద్ద ప్లానింగే ఉందన్నద సంగతి ఇటీవలే బయట పడింది. వరుసగా చిత్రాలన్నీ ఒకే తాటిపైకి తెచ్చి వాటిని పట్టాలెక్కించి ఒకదాని వెంట ఒకటి రిలీజ్ చేసే వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం `వినరోభాగ్యము విష్ణు కథ` ఫేం మురళీ కిషోర్ దర్శకత్వంలో `లెనిన్` సినిమా చేస్తున్నాడు.
ఇది ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమా అప్ డేట్స్ ఇంత వరకూ రివీల్ చేయలేదు. ఈ ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా తేదీ ప్రకటించలేదు. తదుపరి ప్రాజెక్ట్ ల విషయంలోనూ అంతే సీరియస్ గా ముందుకెళ్తున్నాడు. యూవీ క్రియేషన్స్ లో అఖిల్ కి అనీల్ అనే కొత్త కుర్రాడుతో ఓ చిత్రం కమిట్ అయ్యాడు. ఇప్పటికే సినిమా మొదలవ్వాలి. కానీ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు జరుగు తున్నాయి.
ఈ నేపథ్యంలోనే డిలే చేస్తున్నారు. అలాగే `సామజవరగమన`తో మంచి గుర్తింపు దక్కించుకున్న త్రయంలో ఒకరైన నందుతోనూ ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ అయిందని సమాచారం. మరి ఈ విషయాలన్ని అధికారికంగా తెలిసేదెప్పుడు? అఖిల్ అందుకు ముహూర్తం ఏదైనా పెడతున్నాడా? అంటే అతడి పుట్టిన రోజుకే ఈ విషయాలు రివీల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏప్రిల్ 8 అఖిల్ బర్త్ డే. ఆరోజు సెట్స్ లో ఉన్న సినిమాకి సంబంధించి కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారని సమాచారం. అలాగే మిగతా రెండు ప్రాజెక్ట్ ల వివరాలు కూడా అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల నుంచి లీకులందుతున్నాయి. `లెనిన్` తో సంబంధం లేకుండా ఈ చిత్రాలు కూడా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడుట. దీనిలో భాగంగా విషయాన్ని అభిమానులకు చెప్పాలను కుంటున్నట్లు తెలుస్తోంది.
