అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్..!
లేటెస్ట్ గా నాగార్జున, అమల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వాన పత్రిక అందించారు.
By: Tupaki Desk | 31 May 2025 9:03 PM ISTఅక్కినేని ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో నాగ చైతన్య శోభిత పెళ్లి జరిగింది. త్వరలో అఖిల్ జైనబ్ ల వివాహం జరగబోతుంది. లాస్ట్ ఇయర్ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట జూన్ 6న పెళ్లితో ఒకటి కాబోతున్నారు. అఖిల్ జైనబ్ లు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వాళ్ల పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐతే ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు.
నాగ చైతన్య శోభిత పెళ్లి హడావిడిలో ఉండగా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని కూడా నాగార్జున ప్రకటించారు. ఐతే పెళ్లి కూడా ఇద్దరు బ్రదర్స్ ఒకేసారి చేసుకుంటారని అనుకోగా అది జరగలేదు. ఫైనల్ గా జూన్ 6న అఖిల్ జైనబ్ ల మ్యారేజ్ జరుగుతుంది. ఈ పెళ్లి వేడుక వెన్యూ ఎక్కడ ఏంటన్న విషయాలు తెలియాల్సి ఉంది. అఖిల్ పెళ్లి వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది.
లేటెస్ట్ గా నాగార్జున, అమల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వాన పత్రిక అందించారు. అఖిల్ జైనబ్ లు చూడచక్కని జంటగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అఖిల్ సినీ కెరీర్ విషయానికి వస్తే ఏజెంట్ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లుగా సరైన స్క్రిప్ట్ కోసం వెతికిన అక్కినేని హీరో త్వరలో లెనిన్ అంటూ అదిరిపోయే సినిమాతో రాబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రాగా అది ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అఖిల్ లెనిన్ సినిమాకు నాగార్జున కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నారు.
తొలి సినిమా నుంచి ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ లెనిన్ తో అది సాధించేలా ఉన్నాడు. లెనిన్ సినిమా టీజర్ తోనే ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఏర్పడింది. ఐతే అఖిల్ చేస్తున్న సినిమాల్లో తన వరకు 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాడు కానీ మిగతా విషయాలు సరిగా జరగట్లేదు. అందుకే లెనిన్ సినిమా విషయంలో తనతో పాటు అన్ని యాస్పెక్ట్స్ కూడా బాగుండేలా ప్లాన్ చేస్తున్నారు.
