ఫోటో స్టోరీ: పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్న కొత్త జంట
అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు జైనబ్ రవ్‌జీ ని శుక్రవారం ఉదయం 3 గంటల సమయంలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒకటయ్యారు
By: Tupaki Desk | 6 Jun 2025 8:36 PM ISTఅక్కినేని అఖిల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రియురాలు జైనబ్ రవ్‌జీ ని శుక్రవారం ఉదయం 3 గంటల సమయంలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒకటయ్యారు. హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో ఈ పెళ్లి జరగ్గా ఈ పెళ్లికి వధూవరుల కుటుంబ సభ్యులతో పాటూ అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరై, అఖిల్- జైనబ్‌ను ఆశీర్వదించారు.
అఖిల్ పెళ్లి ఇవాళ ఉదయం జరగ్గా, ప్రస్తుతం వారి పెళ్లిలోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అఖిల్ తన తల్లిదండ్రులు నాగార్జున, అమలతో కలిసి పూజ చేస్తున్న ఫోటోలతో పాటూ అఖిల్- జైనబ్ పక్క పక్కన నిల్చున్న ఫోటోలు, ఫ్రెండ్స్ తో కలిసి కొత్త జంట దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
ఈ ఫోటోల్లో అఖిల్ పెళ్లి కొడుకు గెటప్ లో చాలా అందంగా కనిపించగా, జైనబ్ పెళ్లి కూతురిలా పట్టు చీర, దానికి తగ్గ మ్యాచింగ్ జ్యుయలరీలో మెరిసింది. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. వీరి పెళ్లికి చిరంజీవి, రామ్ చరణ్ లు సతీ సమేతంగా హాజరవగా, శర్వానంద్, ప్రశాంత్ నీల్, క్రికెటర్ తిలక్ వర్మ కూడా వచ్చారు.
జూన్ 8న వీరి రిసెప్షన్ ను అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్ గా ఏర్పాటు చేశాడు కింగ్ నాగార్జున. ఈ రిసెప్షన్ కు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న అఖిల్- జైనబ్ కు గతేడాది నవంబర్ లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. డిసెంబర్ లో చైతన్య పెళ్లి కారణంగా అఖిల్ పెళ్లి వాయిదా పడి ఇవాళ జరిగింది.
