Begin typing your search above and press return to search.

అక్కినేని వారింటి చిన్న కోడలు గురించి ఈ విషయాలు తెలుసా..!

అక్కినేని అఖిల్‌ 30 ఏళ్ల వయసులో ఒక ఇంటి వాడు అయ్యాడు. గత రెండేళ్లుగా జైనబ్‌ రన్జీతో ప్రేమలో ఉన్న అఖిల్‌ ఇరు కుటుంబాలను ఒప్పించి ఆమె మెడలో తాళి కట్టాడు.

By:  Tupaki Desk   |   8 Jun 2025 3:43 PM IST
అక్కినేని వారింటి చిన్న కోడలు గురించి ఈ విషయాలు తెలుసా..!
X

అక్కినేని అఖిల్‌ 30 ఏళ్ల వయసులో ఒక ఇంటి వాడు అయ్యాడు. గత రెండేళ్లుగా జైనబ్‌ రన్జీతో ప్రేమలో ఉన్న అఖిల్‌ ఇరు కుటుంబాలను ఒప్పించి ఆమె మెడలో తాళి కట్టాడు. ఇటీవల అక్కినేని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో జైనబ్ మెడలో అఖిల్‌ తాళి కట్టడంతో కొత్త జీవితం మొదలు పెట్టాడు. సుదీర్ఘ కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నప్పటికీ మీడియాకు కూడా పెద్దగా లీక్ కాలేదు. గత ఏడాదిలో వివాహ నిశ్చితార్థంకు ముందు వీరి విషయం లీక్ అయింది. సోషల్‌ మీడియాలో జైనబ్‌ రన్జీ గురించి ఔత్సాహికులు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఆమె ఏంటి? అసలు జైనబ్‌ ప్రొఫెషన్ ఏంటి అనే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

జైనబ్‌ రన్జీ సెలబ్రిటీ కావడంతో ఇంటర్నెట్‌లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. జైనబ్‌ అద్భుతమైన ఆర్టిస్ట్‌. ఆమె వేసిన పెయింటింగ్స్‌ తో ఏకంగా ఆర్ట్‌ గ్యాలరీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా పలు ఆర్ట్‌ గ్యాలరీలను జైనబ్‌ ఏర్పాటు చేశారు. విదేశాల్లోనూ జైనబ్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. జైనబ్‌ చిన్న వయసు నుంచే ఆర్టిస్టుగా మంచి పేరును సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లో పుట్టిన జైనబ్‌ ముంబైలో పెరిగింది. వ్యాపార కుటుంబంకు చెందిన ఈమెకు ఆర్ట్‌పై మక్కువ ఏర్పడటంతో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీని పూర్తి చేసింది. అంతే కాకుండా విదేశాల్లో మోడ్రన్ ఆర్ట్‌ పై ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియా ఇన్ఫులెన్సర్‌గానూ జైనబ్‌ ఉన్నారు. ఆమె స్కిన్‌ సంరక్షణకు సంబంధించిన టిప్స్‌ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. నటిగానూ జైనబ్‌కి ఎంట్రీ ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితమే ఎంఎఫ్‌ హుస్సేన్ తెరకెక్కించిన మీనాక్షి : ఎ టేల్‌ ఆఫ్ త్రీ సిటీస్‌' అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో టబు, కునల్‌ కపూర్‌తో కలిసి జైనబ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. చాలా అందంగా ఉండే జైనబ్‌ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బ్యూటీ టిప్స్ చెబుతూ ఉంటుంది. చర్మ సమస్యలను దూరం చేసుకునే టిప్స్ ఎన్నో ఈమె పేజీలో ఉంటాయి.

అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అయ్యే వ్యక్తిగత అభిరుచికి సెట్‌ అయ్యే విధంగా పెర్‌ఫ్యూమర్‌గానూ జైనబ్‌ గుర్తింపు దక్కించుకున్నారు. పెర్‌ఫ్యూమ్‌ల విషయంలో జైనబ్‌ ఎంతో మంది సెలబ్రిటీలకు సైతం సలహాలు ఇస్తూ ఉంటుంది. వారి అభిరుచికి తగ్గట్లుగా ఎలాంటి పెర్‌ఫ్యూమ్‌ అయితే వారికి సెట్‌ అవుతుంది అనే విషయాన్ని చాలా చక్కగా జైనబ్‌ వివరిస్తుంది. అఖిల్‌ కంటే జైనబ్‌ 9 ఏళ్లు పెద్ద అయినప్పటికీ ఇద్దరి జోడీ చాలా బాగుంది అంటూ సోషల్‌ మీడియాలో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇద్దరి సంతోషంగా ఉండాలని అభిమానులతో పాటు, అంతా కోరుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ జంట నేడు రిసెప్షన్‌ జరుపుకుంటున్నారు. ప్రముఖులు ఈ రిసెప్షన్‌కి హాజరు కాబోతున్నారు.