Begin typing your search above and press return to search.

లెనిన్ విజ‌యాన్ని గ‌ర్వంగా ఫీల‌వుతున్న లేడి ల‌క్ జైన‌బ్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేని అఖిల్ జీవితంలోకి ఆమె `లేడీ లక్`లా అడుగుపెట్టారు.

By:  Sivaji Kontham   |   18 July 2026 9:29 AM IST
లెనిన్ విజ‌యాన్ని గ‌ర్వంగా ఫీల‌వుతున్న లేడి ల‌క్ జైన‌బ్
X

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్కినేని అఖిల్ జీవితంలోకి ఆమె `లేడీ లక్`లా అడుగుపెట్టారు. అఖిల్, జైనబ్ రావూజీల వివాహం తర్వాత అఖిల్ కెరీర్ సరికొత్త మలుపు తిరిగింద‌న‌డానికి ఈ విజ‌యం నిద‌ర్శనం. తాజాగా అఖిల్ నటించిన `లెనిన్` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో అక్కినేని కుటుంబంతో పాటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం నెలకొంది. ఈ సినిమా సాధించిన ఘనవిజయాన్ని అఖిల్ భార్య జైనబ్ రావూజీ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జైన‌బ్ సందడి చేస్తూ.. ``అయ్యగారు నంబర్ వన్`` అంటూ ఎంతో ఉత్సాహంగా కనిపించడం అక్కినేని అభిమానులను ఎంతగానో ఖుషీ చేసింది.

సినిమా ఘనవిజయం సాధించిన ఆనందాన్ని జైనబ్ సోషల్ మీడియా వేదికగా మరోసారి షేర్ చేసుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..``లెనిన్ చిత్రాన్ని ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అఖిల్‌పై మీరంతా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను నిజంగా కృతజ్ఞతురాలిని... చాలా సంతోషంగా ఉంది`` అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. తన భర్త సాధించిన విజయానికి భార్యగా జైన‌బ్ వ్యక్తపరిచిన ఈ ఆనందం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విజయం వెనుక జైనబ్ సపోర్ట్ ఎంతో ఉందనే విషయం ఈవెంట్‌లో అఖిల్ స్వ‌యంగా చెప్పుకొచ్చిన సంద‌ర్భాన్ని మ‌ర్చిపోలేము. ``నా భార్య నాకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూనే ఉంది`` అంటూ అఖిల్ ప‌బ్లిక్ వేదికపై జైనబ్‌ను ఆకాశానికెత్తేశారు. కేవలం ఈ ఈవెంట్‌లోనే కాకుండా చాలా ఇంటర్వ్యూలలో కూడా తన సక్సెస్ వెనుక భార్య అందించిన ప్రోత్సాహం, మానసిక స్థైర్యం ఎంతో ఉన్నాయని అఖిల్ గర్వంగా చెప్పుకొచ్చారు.

అఖిల్ అక్కినేని, జైనబ్ రావూజీలది ప్రేమ వివాహం. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని ఇరువైపులా పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒకటయ్యారు. జైనబ్ రావూజీ వృత్తిరీత్యా డిజైనర్ కావడంతో సెలబ్రిటీ సర్కిల్స్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా జైనబ్ కుటుంబానికి, అక్కినేని కుటుంబానికి దశాబ్దాల కాలంగా ఎంతో బలమైన అనుబంధం, స్నేహసంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య ఉన్న ఈ పాత పరిచయమే అఖిల్, జైనబ్‌లను ఒకరికొకరు దగ్గరయ్యేలా చేసింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఎంతో సంతోషంగా అంగీకరించి అట్టహాసంగా పెళ్లి జరిపించారు. అక్కినేని కుటుంబ సభ్యులందరితోనూ జైనబ్ ఎంతో ఆప్యాయంగా ఉంటూ... ఇంటి కోడలిగా అందరి మనసులను గెలుచుకున్నారు.

అఖిల్ జీవితంలోకి జైనబ్ ప్రవేశించిన తర్వాతే అత‌డి ఫేట్ (అదృష్టం) పూర్తిగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అక్కినేని అభిమానుల్లోనూ గట్టి నమ్మకం ఏర్పడింది. కెరీర్ ప్రారంభంలో అఖిల్‌కు ఆశించిన స్థాయిలో కమర్షియల్ బ్రేక్ రాలేదు. కానీ జైనబ్‌తో వివాహం జరిగిన తర్వాత.. త‌ను అడుగుపెట్టిన వేళావిశేషమో ఏమో కానీ.. అఖిల్ ఎంచుకున్న కథలు, ఆయన లైనప్ అన్నీ పాజిటివ్‌గా మారాయి. ఇప్పుడు `లెనిన్` సినిమాతో అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఈ `లేడీ లక్` సెంటిమెంట్‌ను నిజం చేస్తోంది. ఒక రకంగా జైనబ్ రాకతో అఖిల్ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరమైన జీవితంలోనూ ఒక సరికొత్త విజయవంతమైన అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు.

ఎలాంటి ఒడిదొడుకులు ఎదురైనా భర్తకు కొండంత అండగా నిలబడే భార్య దొరికినప్పుడు ఏ పురుషుడైనా రెట్టించిన ఉత్సాహంతో సక్సెస్ వైపు అడుగులు వేస్తాడనడానికి అఖిల్-జైనబ్ జంట ఒక చక్కని ఉదాహరణ. జైనబ్ ఇచ్చిన సపోర్ట్..అందించిన అదృష్టంతో అఖిల్ అక్కినేని మునుముందు మరిన్ని భారీ విజయాలు అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. `లెనిన్` ఘనవిజయంతో టాలీవుడ్‌లో సరికొత్త జోష్ నింపిన `అయ్యగారు` ఇకపై బాక్సాఫీస్ వద్ద వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.