అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్.. వారంతా కనపడలేదేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని.. రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తన ప్రియురాలితో ఏడడుగులు నడిచారు.
By: Tupaki Desk | 9 Jun 2025 3:45 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని.. రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తన ప్రియురాలితో ఏడడుగులు నడిచారు. జూన్ 6వ తేదీ తెల్లవారుజామున జైనబ్ రవ్జీ మెడలో మూడుముళ్లు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య అఖిల్, జైనబ్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
అయితే పెళ్లికి తక్కువ మందే హాజరైనా.. మ్యారేజ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్డూడియోస్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. అందుకోసం కొద్ది రోజుల క్రితం అనేక మంది సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా వెళ్లి మరీ నాగార్జున ఆహ్వానించారు.
అఖిల్, జైనబ్ రిసెప్షన్ కు టాలీవుడ్ కు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, నిఖిల్, సూర్య, అల్లరి నరేష్, అడివి శేష్, సుధీర్ బాబు, వెంకీ అట్లూరి, సుకుమార్, అల్లు అరవింద్, అశ్వినీ దత్, కేఎల్ నారాయణ, బీవీఎస్ఎన్ ప్రసాద్ తదితరులు వచ్చి కొత్త జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు.
అయితే టాలీవుడ్ కు చెందిన బడా హీరోలు మాత్రం అఖిల్ రిసెప్షన్ లో కనిపించలేదు. బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. వివాహ విందుకు హాజరవ్వలేదు. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ వంటి పలువురు యువ హీరోలు మిస్ అయ్యారు.
వివాహ విందుకు వారు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేదని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వారందరికీ ఆహ్వానం అందినా.. రిసెప్షన్ కు హాజరవ్వలేదు. కొందరు షూటింగ్స్ తో బిజీ ఉండగా.. మరికొందరు తమ పర్సనల్ వర్క్స్ తో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
కాగా, నాగార్జున- అమల కుమారుడైన అఖిల్.. కొంతకాలం క్రితం జైనబ్ ను ఓ సందర్భంలో కలిశారు. అప్పుడు వారి మధ్య పరిచయం ఏర్పడగా, అది కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం పాటు ప్రేమలో మునిగితేలిన వారిద్దరూ, ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు శుభముహూర్తాన పెళ్లితో ఒక్కటయ్యారు.
