అక్కినేని అఖిల్ ఇంత వరకు ఆ పని ఎందుకు చేయలేదు?
యంగ్ హీరో అక్కినేని అఖిల్ రీసెంట్‌గా కొత్త ఫేజ్‌లోకి ఎంటరయ్యాడు.
By: Tupaki Desk | 19 Jun 2025 1:00 AM ISTయంగ్ హీరో అక్కినేని అఖిల్ రీసెంట్‌గా కొత్త ఫేజ్‌లోకి ఎంటరయ్యాడు.జూన్ 6న తన ప్రియురాలు జైనాబ్‌ని ఇరు కుటుంబాల అంగీకారంతో గ్రాండ్‌గా వివాహం చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మెంబర్స్, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ మ్యారేజ్‌లో పాల్గొన్నారు. అత్యంత లోప్రొఫైల్‌లో వివాహం జరిపించిన నాగార్జున రిసెప్షన్‌ని మాత్రం రెండు రోజుల తరువాత చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ రిసెప్షన్‌లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. అఖిల్. జైనాబ్‌ల వివాహం తరువాత ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలని నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే హీరో అఖిల్ మాత్రం ఇంత వరకు తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్‌ని సోషల్ మీడియా ఇన్ స్టావేదికగా అభిమానులతో పంచుకోలేదు. ఏడాది క్రితం జైనాబ్‌తో ఉన్న ఫొటోలని షేర్ చేసిన అఖిల్ పెళ్లి ఫోటోలని మాత్రం ఇప్పటికి వరకు అభిమానులతో పంచుకోకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అఖిల్ ప్రస్తుతం `లెనిన్` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ని మాత్రమే ఇన్ స్టాలో షేర్ చేసిన అఖిల్ పెళ్లి ఫొటోలని ఎప్పుడు షేర్ చేస్తాడో అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారట. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలనే అఖిల్ పెళ్లి ఫొటోలని షేర్ చేయలేదని కొంత మంది వాదిస్తున్నారు.
