అఖిల్ పెళ్లిలో చైతూ, శోభిత ఇలా...!
నాగ చైతన్య, శోభితలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇద్దరు మ్యాచ్ అయ్యే విధంగా పట్టు వస్త్రాలను ధరించారు. ఇద్దరూ సింపుల్ అండ్ స్వీట్‌గా ఉన్నారు.
By: Tupaki Desk | 7 Jun 2025 3:30 PM ISTఅక్కినేని వారి ఇంటి పెళ్లి సందడిలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నాగార్జున వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికలు అందించన విషయం తెల్సిందే. అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ అధికారికంగా బయటకు రాలేదు. కొన్ని ఫోటోలు పెళ్లి ఏ స్థాయిలో జరిగిందో చెప్పకనే చెబుతున్నాయి. పలువురు ప్రముఖులు హాజరు అయిన ఈ పెళ్లిలో నాగ చైతన్య, శోభిత దూళిపాళ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది. అన్న, వదినల స్థానంలో వీరిద్దరు అఖిల్ పెళ్లిలో నిలిచినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
నాగ చైతన్య, శోభితలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇద్దరు మ్యాచ్ అయ్యే విధంగా పట్టు వస్త్రాలను ధరించారు. ఇద్దరూ సింపుల్ అండ్ స్వీట్‌గా ఉన్నారు. ఫ్యామిలీ ఫోటో నుంచి వీరిద్దరిని కట్ చేసి నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య, శోభితల ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. అఖిల్, జైనాబ్ జంటతో పోల్చుతూ, నాగ చైతన్య-శోభితల జోడీ ఫోటోలను షేర్ చేస్తూ కొందరు చర్చలు మొదలు పెట్టారు. మొత్తానికి నాగ చైతన్య, శోభిత ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. నెట్టింట ఈ ఫోటోలు తెగ వైరల్ కావడంతో వీరిద్దరు కలిసి ఒక సినిమాలో హీరో, హీరోయిన్‌గా నటిస్తే బాగుండు అని చాలామంది అంటున్నారు.
అఖిల్, జైనాబ్‌ల వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి జంట కూడా ప్రముఖ డిజైనర్ రూపొందించిన వెడ్డింగ్ ఔట్ ఫిట్‌లో కనిపించారు. అన్నపూర్ణ స్టూడియోలోనే నాగచైతన్య, శోభితల వివాహం జరిగిన విషయం తెల్సిందే. అక్కడే వీరి వివాహం కూడా జరిగినట్లు తెలుస్తోంది. నాగార్జున, అమల ప్రేమకు చిహ్నంగా పుట్టిన అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. సినిమాల్లో ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేక పోయిన అఖిల్ ప్రేమలో మాత్రం సక్సెస్ అయ్యాడు. జైనాబ్ ను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న అఖిల్ ఇప్పుడు ఆమె మెడలో మూడు ముళ్లు వేయడం ద్వారా కొత్త జీవితంలో అడుగు పెట్టాడు.
ఇక నాగ చైతన్య సినిమా విషయానికి వస్తే తండేల్ సినిమాతో మొదటి వంద కోట్ల సినిమాను దక్కించుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ నేపథ్యంలో నాగ చైతన్య తదుపరి సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో నాగ చైతన్య నటించబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. గత రెండు మూడు నెలలుగా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది సినిమాను పట్టాలెక్కించి, వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు. సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం అందుతోంది.
