Begin typing your search above and press return to search.

అఖిల్ లో అగ్గి ర‌గిలిస్తోన్న విరాట్ కొహ్లీ!

ఈ కోవలోనే టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని కూడా విరాట్ కోహ్లీ కమిట్‌మెంట్ గురించి పలు సందర్భాల్లో తన అభిమానాన్ని, ఆశ్చర్య‌క‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   29 July 2026 2:27 PM IST
అఖిల్ లో అగ్గి ర‌గిలిస్తోన్న విరాట్ కొహ్లీ!
X

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు రోల్ మోడల్‌గా నిలిచిన కింగ్ విరాట్ కోహ్లీ ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో విరాట్ దూకుడు, ఫిట్‌నెస్ పట్ల ప్రదర్శించే నిబద్ధత ఎంతోమందిని నిత్యం ఇన్‌స్పైర్ చేస్తుంటాయి. క్రికెటర్లే కాకుండా ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం కోహ్లీ డెడికేషన్‌కు ఫిదా అవుతుంటారు. ఈ కోవలోనే టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని కూడా విరాట్ కోహ్లీ కమిట్‌మెంట్ గురించి పలు సందర్భాల్లో తన అభిమానాన్ని, ఆశ్చర్య‌క‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.

అఖిల్‌కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా? క్రీడా రంగంలోని పరిణామాలను నిరంతరం గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ వర్కింగ్ స్టైల్, ఆయన దినచర్య , ఆటపై ఉండే అంకితభావం తనలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయని అఖిల్ పలుమార్లు పేర్కొన్నారు. కోహ్లీ మైదానంలో పడే చెమట, తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి చేసే కఠినమైన శ్రమ క్రీడాకారులకే కాకుండా ప్రతి ఒక్కరికీ పాఠం లాంటిదని న అఖిల్ అభివర్ణించారు.

విరాట్‌లో ఉండే కమిట్‌మెంట్‌లో కనీసం 15 శాతం ఏ రంగంలోనైనా ఉన్న వ్యక్తి అలవర్చుకుంటే చాలని అఖిల్ అభిప్రాయపడ్డారు. జీవితంలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ మాత్రం కఠిన శ్రమ తప్పనిసరి అని వెల్లడించారు. కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని దాని వెనుక నిరంతర సాధన, క్రమశిక్షణ ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కోహ్లీ జీవితం నిరూపిస్తోందని అఖిల్ కొనియాడారు.

ఇండస్ట్రీలో కూడా నిలదొక్కుకోవడానికి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఈ తరహా మానసిక దృఢత్వం చాలా అవసరమని అఖిల్ భావిస్తున్నారు. సినిమాల ఎంపికలో బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో తాను కూడా ఎంతో కష్టపడటానికి ఇలాంటి గ్లోబల్ లెజెండ్సే తనకు స్పూర్తి అని అన్నారు. కష్టపడే తత్త్వం ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవుతుందనే దానికి కోహ్లీ ప్రయాణమే పెద్ద నిదర్శనమని అఖిల్ బలంగా నమ్ముతున్నారు.

యువత తమ జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు నిరాశ చెందకుండా విరాట్ కోహ్లీ లా మరింత కసితో ముందుకు సాగాలని అఖిల్ పిలుపునిస్తుంటారు. విరాట్ లోని టెంపర్, పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలెంట్ తో పాటు అంకితభావం ఉంటే ఏ రంగంలోనైనా తిరుగులేకుండా రాణించవచ్చని కోహ్లీ కెరీర్ నిరూపిస్తోందని అఖిల్ ప్రశంసల జల్లు కురిపించారు.

విరాట్ కోహ్లీ క్రికెటర్ మాత్రమే కాదు. అఖిల్ లాంటి ఎంతో మంది యువ నటులకు ఇన్‌స్పిరేషన్ ఇంజిన్‌లా పని చేస్తున్నారు. విరాట్ చూపిన మార్గంలో పయనిస్తూ ప్రతీ విషయంలోనూ శ్రద్ధ పెడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే అఖిల్ మాటలు నేటి యువతకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.