Begin typing your search above and press return to search.

అఖిల్ మైండ్ లో పెద్ద పెద్దోళ్లే ఉన్నారండోయ్!

అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా తనదైన ముద్ర వేయడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఫ‌లితాలే ఆశాజ‌న‌కంగా రావ‌డం లేదు.

By:  Srikanth Kontham   |   6 July 2026 12:20 PM IST
అఖిల్ మైండ్ లో పెద్ద పెద్దోళ్లే ఉన్నారండోయ్!
X

అక్కినేని అఖిల్ కెరీర్ పరంగా తనదైన ముద్ర వేయడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ ఫ‌లితాలే ఆశాజ‌న‌కంగా రావ‌డం లేదు. తానెంత ఎఫెర్ట్ పెట్టినా? ఏదో లోపం అఖిల్ ను అంత‌కంత‌కు వెన‌క్కి లాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో తదుపరి ప్రాజెక్టు విషయంలో స్పష్టమైన లక్ష్యాలతో అఖిల్ ముందుకెళ్తున్నారు. అఖిల్ మైండ్ లో ఉన్న డైరెక్ట‌ర్ల లిస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సుకుమార్, ఎస్.ఎస్. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి అగ్రశ్రేణి దర్శకులతో కలిసి పనిచేయాలని అఖిల్ బలమైన కోరికను వ్యక్తం చేసారు.

పరిశ్రమలో అత్యుత్తమ సృజనాత్మకత కలిగిన దర్శకుల సినిమాల్లో నటించడం నటుడిగా తన స్థాయిని పెంచుతుందని ఆశా భావం వ్య‌క్తం చేసారు. అయితే అఖిల్ కోరిక నెర‌వేర‌డం అంత సులభం కాదని అఖిల్ కి బాగా తెలుసు. ఒక నటుడికి భారీ ప్రాజెక్టులు దక్కడం అనేది కేవలం తన చేతుల్లోనే లేదని అఖిల్ వాస్తవిక దృక్పథంతో ఉన్నారు. గొప్ప దర్శకులు ఎప్పుడూ తమ కథలకు సరిపోయే బలమైన ప్రతిభావంతులైన నటుల కోసం చూస్తుంటారు. కాబట్టి ఆ దర్శకుల దృష్టిలో పడాలంటే తాను మరింత నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నారు.

పరిశ్రమలో ఎదగడానికి ప్రతిభ ఒక్కటే సరైన మార్గమని అఖిల్ నమ్ముతున్నారు. నటన ద్వారా తాను ఇచ్చే అవుట్‌పుట్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే? అంతటి పెద్ద అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తాయని అఖిల్ భావిస్తున్నారు. ట్యాలెంట్ ఉంటే తప్ప ఏ అగ్ర దర్శకుడు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని ఆయనకు తెలుసు. అందుకే నటనలో పరిణితిని పెంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నారు. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలంటే కేవలం నటన మాత్రమే సరిపోదు. ఆయా పాత్రల కోసం శారీరక దృఢత్వం, కథపై అవగాహన, పాత్రకు ప్రాణం పోసే నిబద్ధత అవసరమని అఖిల్ భావిస్తున్నారు.

తనపై వ‌స్తోన్న‌ విమర్శలను పాజిటివ్‌గా తీసుకుంటూ బలహీనతలను అధిగమించి మెరుగైన నటనతో తనను తాను మలచుకుంటున్నారు. అఖిల్ చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసిన అఖిల్ ఇప్పుడు ఎంతో పరిణితితో వ్యవహరిస్తున్నారు. తొందరపడి సినిమాలు చేయడం కంటే మంచి కథలను , గొప్ప దర్శకులను ఎంచుకోవడం ముఖ్యమని గుర్తించారు. సరైన సమయం రావాలని అప్పటివరకు తనను తాను సిద్ధం చేసుకోవడంపైనే దృష్టి పెట్టాలని అఖిల్ భావిస్తున్నారు.

ఓపిక కు పట్టుదల తోడైతే ఆశించిన స్థాయిలో అఖిల్ అగ్ర దర్శకులతో పని చేయగలరు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తనలోని ప్రతిభను నిరూపించుకుని టాప్ దర్శకుల సినిమాల్లో నటిస్తాననే ధీమాతో అఖిల్ ముందుకు సాగుతు న్నారు. అగ్రశ్రేణి దర్శకులతో పనిచేయాలనే తన కలను నిజం చేసుకోవడానికి అవసరమైన మార్పులను చేసుకుం టున్నారు. తనకంటూ ఓ బలమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న రోజున అగ్ర దర్శకులు ఆయన్ని పిలిచి మరీ అవకాశం ఇస్తారనే నమ్మకంతో ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంగా సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం అఖిల్ న‌టించిన `లెనిన్` రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.