Begin typing your search above and press return to search.

వైఫ‌ల్యాలు..విజ‌యాన్ని బ్యాలెన్స్ చేస్తోన్న అఖిల్!

అక్కినేని వారసుడిగా అరంగేట్రం చేసిన తొలి రోజుల్లోనే అఖిల్ అక్కినేనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Srikanth Kontham   |   21 Sept 2026 7:00 AM IST
వైఫ‌ల్యాలు..విజ‌యాన్ని బ్యాలెన్స్ చేస్తోన్న అఖిల్!
X

అక్కినేని వారసుడిగా అరంగేట్రం చేసిన తొలి రోజుల్లోనే అఖిల్ అక్కినేనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లామర్, డ్యాన్స్, ఫైట్స్ విషయంలో మొదటి సినిమా నుంచే తనదైన మార్కు చూపించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విజయం మాత్రం అతడికి అంత సులభంగా దక్కలేదు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఊహించని పరాజయాలు ఒక రకంగా అతడి వేగానికి బ్రేకులు వేశాయని చెప్పొచ్చు. అయితే ఈ వైఫల్యాలను చూసి క్రుంగిపోకుండా తన ప్రయాణాన్ని పునఃసమీక్షించుకోవడానికి వాటిని ఓ గొప్ప అవకాశంగా అఖిల్ మలు చుకున్నాడు.

సినిమా పరిశ్రమలో ఒక పరాజయం ఎదురైనప్పుడు వెంటవెంటనే సినిమాలు చేసి ఆ లోటును భర్తీ చేయాలనే తొందరపాటు చాలామందిలో కనిపిస్తుంది. కానీ అఖిల్ మాత్రం పూర్తి భిన్నమైన బాటను ఎంచుకున్నాడు. వైఫల్యాలు ఎదురైనప్పుడు తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ స్క్రిప్ట్ ఎంపికలో వేగాన్ని తగ్గించాడు. పరాజయాలు అతడి కెరీర్ వేగాన్ని మందగించేలా చేసినప్పటికీ అవి అతడికి సినిమా పట్ల, కథల ఎంపిక , మార్కెట్ లెక్కల పట్ల పూర్తి స్పష్టతను అందించాయి.

వరుస పరాజయాల తర్వాత విజయాన్ని అందుకోవడం ఏ నటుడికైనా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఆ విజయం తలకు ఎక్కకుండా అత్యంత పరిణతితో వ్యవహరించడం అఖిల్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. విజయం లభించిందని పొంగిపోకుండా? వరుసగా సినిమాలు సంతకం చేయాలనే ఒత్తిడికి లోనుకాకుండా మానసిక సమతుల్యతను కాపాడుకున్నాడు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగడమే నటుడి పరిపూర్ణ ఎదుగుదలకు చిహ్నమని నిరూపించాడు.

ప్రస్తుతం కొత్త కథల ఎంపిక విషయంలో అఖిల్ అనుసరిస్తున్న వ్యూహం ఆకట్టుకుంటోంది. గతంలో చేసిన తప్పులు పునరావృత్తం కాకూడదనే ఉద్దేశంతో ప్రతీ కథను లోతుగా విశ్లేషిస్తున్నాడు. కేవలం నటుడిగా తనను కొత్తగా ఆవిష్కరించే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. హడావుడిగా సెట్స్ పైకి వెళ్లడం కంటే, ప్రీ-ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం కేటాయించి పక్కా ప్రణాళికతో ముందడుగు వేయడానికే మొగ్గు చూపుతున్నాడు.

దర్శకుల ఎంపిక విషయంలోనూ అఖిల్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కేవలం స్టార్ డైరెక్టర్ల వెంటే పడకుండా.. వినూత్న భావాలు ఉన్న కొత్త దర్శకులను, యువ ప్రతిభను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాడు. అయితే వారి అనుభవం , కథను తెరకెక్కించే సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు. ఈ రకమైన వ్యూహాత్మక ఆలోచన అతడిలో వచ్చిన వృత్తిపరమైన మెచ్యూరిటీకి అద్దం పడుతోంది.

మొత్తానికి పరాజయాల నుంచి నేర్చుకున్న పాఠాలు అఖిల్‌ను మరింత బలంగా, పరిణతి చెందిన నటుడిగా తీర్చిదిద్దాయి. విజయం ఇచ్చే కిక్ లో కొట్టుకుపోకుండా? ఓటమి నైరాశ్యంలో కూరుకుపోకుండా? బ్యాలెన్స్‌డ్‌గా ప్రయాణించడం అఖిల్ ప్లస్ పాయింట్‌గా మారింది. ఇదే ధోరణితో నిలకడగా ఆచితూచి అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో అఖిల్ కెరీర్‌లో మరిన్ని అద్భుతమైన విజయాలు నమోదు కావడం ఖాయం.