అఖిల్ కథల ఎంపిక వెనుక వ్యూహాత్మక మౌనం!
అఖిల్ కొత్త సినిమాపై రకరకాల చక్కర్లు కొడుతున్నాయి. పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ల కథలను పరిశీలిస్తున్నారని..
By: Srikanth Kontham | 24 Oct 2026 10:00 AM ISTకెరీర్‌లో ఎంతటి భారీ విజయం దక్కినా? తదుపరి అడుగు ఎలా పడుతుందనేదే హీరో నిజమైన మార్కెట్‌ను నిర్ణయిస్తుంది. `లెనిన్` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకుని మంచి ఊపుమీదున్న అఖిల్ ప్రస్తుతం తదుపరి ప్రాజెక్ట్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ఫలితాలను దృష్టిలో ఉంచుకుని తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెనుక విజయం ఉందని హడావుడిగా ప్రాజెక్ట్‌లను ప్రకటించకుండా స్క్రిప్ట్ రూపకల్పనకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న సన్నివేశం కనిపిస్తోంది.
అఖిల్ కొత్త సినిమాపై రకరకాల చక్కర్లు కొడుతున్నాయి. పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ల కథలను పరిశీలిస్తున్నారని.. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కూడా చర్చలు జరిగాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాంబినేషన్ల క్రేజ్ చూసి ఓకే చెప్పకుండా స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేంత వరకు క్లారిటీ ఇవ్వకూడదనే ఉద్దేశంతో అఖిల్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలస్యం వెనుక నిరాశ కంటే పక్కా ప్రణాళికే కనిపిస్తోంది.
`లెనిన్` చిత్రంలో గ్రామీణ నేపథ్యం.. రాయలసీమ యాసతో అఖిల్ చేసిన ప్రయోగం ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇకపై మాస్ యాక్షన్ సినిమాలకే పరిమితం అవుతారా? లేక సరికొత్త జోనర్లను ప్రయత్నిస్తారా ?అనేది ఆసక్తికరంగా మారింది. హీరోయిజం మాత్రమే కాకుండా కథలో బలమైన భావోద్వేగాలు, నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకోవాలని అఖిల్ భావిస్తున్నారు. యువ కెరీర్ ప్రయాణంలో ఒక నటుడిగా మరింత పరిణతి సాధించడమే ప్రధాన లక్ష్యమని అఖిల్ సన్నిహితుల నుంచి తెలుస్తోంది.
అలాగే అక్కినేని కాంపౌండ్ నుంచి వస్తున్న కథలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. డాడ్ నాగార్జున స్వయం గా అఖిల్ తదుపరి సినిమా స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నారని.. అన్నపూర్ణ స్టూడియోస్ లేదా కాంబినేషన్ బ్యానర్లలో ప్రాజెక్ట్ రూపొందించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అలా అని తొందరపడి ఏ ప్రాజెక్ట్‌నూ హోల్డ్‌లో పెట్టకుండా మంచి కథన సిద్ధమైన తర్వాతే అడుగు ముందుకు వేయాలని అక్కినేని ఫ్యామిలీ ఆచితూచి అడుగలు వేస్తోంది.
ఇక్కడ విశ్లేషించాల్సిన విషయం ఏంటంటే? విజయవంతమైన సినిమా తర్వాత నటుడి నుంచి ప్రేక్షకులు ఆశించే ప్రమాణాలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఒకెత్తయితే.. సాధించిన విజయం ద్వారా వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అక్కినేని అనే స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా?సొంత ఇమేజ్‌ను, బాక్సాఫీస్ స్థిరత్వాన్ని సొంతం చేసుకోవడానికి సాలిడ్ స్క్రిప్ట్ అవసరం. ఈనేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం అంత సవాల్ తోకూడిన వ్యవహారమే.
