ఇప్పటికైనా అయ్యగారి కెరీర్ ఊపందుకుంటుందా?
ఏజెంట్ డిజాస్టర్‌తో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని అఖిల్ కెరీర్ ఇప్పటికైనా ఊపందుకునేనా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 7 April 2025 9:55 AM ISTఏజెంట్ డిజాస్టర్‌తో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని అఖిల్ కెరీర్ ఇప్పటికైనా ఊపందుకునేనా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముద్దుగా అయ్యగారు అని పిలుచుకుని అక్కినేని మూడవతరం హీరో అఖిల్ హీరోగా నిలబడేందుకు గజినీ మహ్మద్‌లా దండయాత్ర చేస్తున్నాడు. నాగార్జున వారసుడిగా అరంగేట్రం చేసిన అఖిల్ హీరోగా పరిచయమైన మూవీ `అఖిల్`. హీరో నితిన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచి అఖిల్‌కు షాక్ ఇచ్చింది.
ఈ పరాజయాల పరంపర `ఏజెంట్` వరకు కొనసాగుతూనే ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన హీరోగా మాత్రం అఖిల్ ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్‌తో చేసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మినహా ఏ సినిమా కూడా అఖిల్‌కు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. వరుస సినిమాలు చేస్తూ ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ అంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. 9 ఏళ్ల కెరీర్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడంతో అఖిల్‌లో అంతఃర్మథనం మొదలైంది.
డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ విషయంలో పూర్తి ఎఫర్ట్ పెడుతున్నా కంటెంట్ విషయంలో కేర్ తీసుకోకపోవడంతో అఖిల్‌కు వరుస ఫ్లాపులు అనివార్యం అవుతూ వచ్చాయి. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్‌రెడ్డితో అఖిల్ చేసిన మూవీ `ఏజెంట్`. ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దీని ప్రమోషన్స్‌లోనూ చురుగ్గా పాల్గొని స్టట్స్ కూడా చేయడం తెలిసిందే. అయితే అఖిల్ అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ సినిమా తొలి షోకే భారీ డిజాస్టర్ అనిపించుకుని షాక్ ఇచ్చింది. దీంతో ఆలోచనలో పడ్డ అఖిల్ ఇకపై ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం అఖిల్ మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెట్టాడు. `వినరో భాగ్యము విష్ణుకథ` ఫేమ్ మురళీ కిఫోర్ డైరెక్షన్‌లో ఓ కొత్త కథతో రాబోతున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఈ నెల 8న రాబోతోంది. దీన్ని సితార వంశీ నిర్మించనున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు `లెనిన్` అనే టైటిల్‌ని ఫైనల్ చేయనున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనితో పాటు యువీ క్రియేషన్స్‌లో ఓ పీరియాడిక్ డ్రామా చేయబోతున్నారు. దీనికి కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నారు. దీని ప్రకటన కూడా ఈ 8నే రానుంది.
ఈ రెండు ప్రాజెక్ట్‌లతో పాటు `సామజవరగమన`కు సహ రైటర్‌గా వ్యవహరించిన నందు డైరెక్షన్‌లో ఓసినిమకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. అఖిల్ ప్లానింగ్ చూసిన వారంతా అయ్యగారి కెరీర్ ఈసారైనా ఊపందుకుంటుందా? అని చర్చించుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అకిల్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌లతో బౌన్స్ బ్యాక్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.