'లెనిన్'తో అఖిల్‌కు ఇక తిరుగులేదా?
యుద్ధం కంటే ప్రేమ మరింత ప్రమాదకరమైనది అనే క్యాప్షన్‌తో రానున్న ఈ సినిమాకు 'లెనిన్' అనే టైటిల్‌ని ప్రకటించారు.
By: Tupaki Desk | 9 April 2025 10:16 AM ISTఅభిమాన హీరో బ్లాక్ బస్టర్ హిట్‌లని సొంత చేసుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది. అనుకున్న విధంగా నచ్చిన హీరో క్రేజీ హిట్‌ని దక్కించుకుంటే అభిమానుల ఆనందం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కానీ అదే హీరో ఏళ్లుగడుస్తున్నా కనీసం హిట్‌ని కూడా దక్కించుకోలేకపోతే అభిమానలు పడే బాధ వర్ణణాతీతం. గత కొంత కాలంగా అక్కినేని అభిమానులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ హీరో ఈ ఏడాదైనా ట్రెమండస్ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని మా కోరిక నెరవేరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అర్థమై ఉంటుంది. యస్ అక్కినేని అభిమానులు చాలా ఓపిగా అక్కినేని అఖిల్ కొట్టబోయే బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అక్కినేని మూడవ తరం వారసుడిగా అరంగేట్రం చేసిన అఖిల్ గత కొంత కాలంగా హిట్ అనే మాట వినడం కోసం ఎదురుచూస్తున్నాడు. 'మనం' ఫేమ్‌ని నమ్ముకుని చేసిన 'హలో' ఆకట్టుకోలేకపోయింది. ఇక స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్‌రెడ్డిని నమ్మకుని చేసిన 'ఏజెంట్' డిజాస్టర్‌గా నిలిచి హీరో అఖిల్‌కు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది.
దీంతో ఆలోచనలోపడిన అఖిల్ 'ఏజెంట్ తరువాత మరో సినిమా అంగీకరించడానికి ఏడాదిన్నర టైమ్ తీసుకున్నాడు. ఈ సమయంలో చాలా కథలు విన్న అఖిల్ ఫైనల్‌గా 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అఖిల్ మేకోవర్, రగ్గ్‌డ్ లుక్ సినిమాలో అంచనాల్ని పెంచేశాయి. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేశారు.
యుద్ధం కంటే ప్రేమ మరింత ప్రమాదకరమైనది అనే క్యాప్షన్‌తో రానున్న ఈ సినిమాకు 'లెనిన్' అనే టైటిల్‌ని ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్‌లో అఖిల్ కనిపించిన తీరు, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంత వరకు ఓ స్టార్ కిడ్‌లా కనిపించిన అఖిల్ ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేలా ఉన్నాడని, ఈ సినిమాతో అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ అఖిల్‌కు లభించడం ఖాయమని, అఖిల్‌కు ఇక తిరుగులేదనే చర్చ సర్వత్రా మొదలైంది. మరి 'లెనిన్' అక్కినేని అభిమానుల ఆశలని ఎంత వరకు నిలబెడుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
